Bangaru Shruthi : బీజేపీకి బిగ్ షాక్..? సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బంగారు శృతి

ప్రస్తుతం ఆమె బీజేపీ ప్రధాన కార్యదర్శి కావడంతో పార్టీ వ్యూహాలు, అంతర్గత అంశాలు పూర్తిగా తెలుసు. అలాంటి వ్యక్తి ముఖ్యంత్రి రేవంత్ ను కలవడంతో కమలనాథులు కంగారు పడుతున్నారు.

Bangaru Shruthi : బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఆమె సీఎం రేవంత్ ను కలవడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ టికెట్ ను శృతి ఆశించారు. అయితే, ఆ సీటును బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు భరత్ కు ఇచ్చింది బీజేపీ హైకమాండ్.

టికెట్ ఆశించి భంగపడ్డ శృతి ఇప్పుడు సైలెంట్ గా రేవంత్ రెడ్డిని కలవడంతో బీజేపీకి షాక్ తగులుతుందని భావిస్తున్నారు. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన బంగారు లక్ష్మణ్ కూతురే బంగారు శృతి. ప్రస్తుతం ఆమె బీజేపీ ప్రధాన కార్యదర్శి కావడంతో పార్టీ వ్యూహాలు, అంతర్గత అంశాలు పూర్తిగా తెలుసు. అలాంటి వ్యక్తి ముఖ్యంత్రి రేవంత్ ను కలవడంతో కమలనాథులు కంగారు పడుతున్నారు. బంగారు శృతి సీఎం రేవంత్ ను కలవడం.. పార్లమెంట్ ఎన్నికల ముందు నష్టం చేకూర్చే అంశంగా భావిస్తోంది బీజేపీ.

Also Read : బీజేపీ ఎంపీ అభ్యర్థుల మొదటి జాబితా.. ఆ మూడు స్థానాల్లో అసమ్మతి రాగం

 

ట్రెండింగ్ వార్తలు