Sadineni Yamini Sharma
Sadineni Yamini Sharma : కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ. కాంగ్రెస్.. దేశ ప్రజలను లూటీ చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని తేల్చి చెప్పారు. ”’కుల గణన చేసి ప్రజల ఆస్తిని లెక్కించి తిరిగి పంచుతాం అని కాంగ్రెస్ అంటోంది. ప్రజల కష్టాన్ని లెక్కించి కులగణన చేసి పంచుతారట కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే. ఆడవారి మంగళసూత్రాన్ని కూడా వదిలే పరిస్ధితి లేదు కాంగ్రెస్ వస్తే. ప్రజలకు పదేళ్ళుగా సంక్షేమం అందుతోంది. కులమత భేదం ఎప్పుడూ బీజేపీ చూపలేదు.
ప్రైవేట్, ప్రభుత్వ సంస్ధల్లో మైనారిటీలకు స్ధానం కల్పిస్తారని రాహుల్ గాంధీ అన్నారు. బలవంతంగా ప్రైవేట్ కంపెనీలపై అధికారాన్ని రుద్దుతారట. ఓటు బ్యాంకు కోసమే మైనారిటీలను కాంగ్రెస్ ఉపయోగించుకుంటోంది. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఒక్కటే అన్న రీతిలో బుద్ధి చూపిస్తున్నారు. మత ప్రాతిపదికన కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గపు ఆలోచనను ఖండిస్తున్నాం.
కష్టార్జితాలను రాజకీయ లబ్ధి కోసం దోచుకునే పార్టీలకు ఇవ్వకూడదు. దేశ సంపాదనపై ముస్లిం మైనారిటీలకు ప్రధమ హక్కు ఉండాలని కాంగ్రెస్ అనడం మతతత్వ రాజకీయం కాదా? ముస్లింలను బుజ్జగించడానికి మేనిఫెస్టోలో ఇదంతా రాసుకున్నారా? ఏపీలో సీపీ, డీజీ ఇంటెలిజెన్స్ లను ట్రాన్సఫర్ చేశారు. రాజకీయ నాయకులకు కొమ్ముకాస్తే ఇలాంటివే జరుగుతాయి” అని సాధినేని యామినీ శర్మ అన్నారు.
Also Read : వైసీపీ ఎన్నికల ప్రణాళికపై ఆసక్తికర చర్చ.. నవరత్నాలకు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా మ్యానిఫెస్టో..?!