Raja Singh : త్వరలోనే కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్..!- రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

తనను కూడా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఇలానే అరెస్ట్ చేసిందని, ఇప్పుడు కవితను అలానే అరెస్ట్ చేస్తే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు.

Raja Singh : ఈరోజు కాకపోతే రేపైనా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాల్సి వచ్చేదన్నారు గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. మోదీ పాలనలో అవినీతిపరులంతా జైలుకి వెళ్లాల్సిందే అన్నారు రాజాసింగ్. ఇవాళ కవిత అరెస్ట్ కాగా.. త్వరలోనే కేసీఆర్, కేటీఆర్ కూడా జైలుకి వెళ్లాల్సిందేనన్నారు రాజాసింగ్.

తనను కూడా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఇలానే అరెస్ట్ చేసిందని, ఇప్పుడు కవితను అలానే అరెస్ట్ చేస్తే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు. తాను తప్పు చేయకున్నా అరెస్ట్ అయ్యాయన్న రాజాసింగ్.. కవిత మాత్రం తప్పు చేసి అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ అరెస్ట్ తర్వాత పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన కవిత.. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామని.. చట్టంపై నమ్మకంతోనే ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ రేపు ఛాలెజ్ పిటిషన్ వేయనున్నారు.

మనీలాండరింగ్ చట్టం కింద కవితను అరెస్ట్ చేసినట్లు ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు ఇచ్చిన అరెస్ట్ నోటీసుల్లో ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఇవాళ(మార్చి 15) సాయంత్రం 5.20 గంటలకు కవితను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. అరెస్ట్ కు గల కారణాలపై 14 పేజీలతో కూడిన మెమోను కవితకు అందించింది ఈడీ.

 

Also Read : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వెనుక స్ట్రాటజీ అదే..! ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ

 

ట్రెండింగ్ వార్తలు