Mayawati: విపక్షాలపై దురహంకార వైఖరి.. బీజేపీపై మండిపడ్డ మాయావతి

రాష్ట్రంలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం వంటి అంశాలపై విపక్షాలు కొద్ది రోజులుగా నిరసన చేపట్టడుతున్నాయి. అయితే ఈ నిరసనలను విమర్శపై బీజేపీ నేతలు స్పందిస్తూ విపక్షాలను నిరుద్యోగులంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ చేసిన ఈ వ్యాఖ్యలపై మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mayawati: ప్రతిపక్ష పార్టీలపై భారతీయ జనతా పార్టీ దురహంకార వైఖరి ప్రదర్శిస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి మండిపడ్డారు. తొందరలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాగా రాష్ట్రంలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం వంటి అంశాలపై విపక్షాలు కొద్ది రోజులుగా నిరసన చేపట్టడుతున్నాయి. అయితే ఈ నిరసనలను విమర్శపై బీజేపీ నేతలు స్పందిస్తూ విపక్షాలను నిరుద్యోగులంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ చేసిన ఈ వ్యాఖ్యలపై మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం ఈ విషయమై తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ముందు విపక్షాలను నిరుద్యోగులని బీజేపీ అనడం వారిపై విపక్షాలపై దురహంకార వైఖరిని ప్రదర్శించడమే. బాధ్యతారాహిత్యమైన వారి వైఖరిని ఈ విధంగా బయటపెడుతున్నారు. ప్రభుత్వ ఆలోచనలు ప్రజా ప్రయోజనాలు, ప్రజా సంక్షేమంపై నిజాయితీని, విధేయతను నిరూపించుకునే వైపుకు కాకుండా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ.. ప్రభుత్వ తప్పిదాలను వారిపై రుద్దే వైపుకు పయనిస్తోంది’’ అని ట్వీట్ చేశారు.

ఇక మరో ట్వీట్‭లో ‘‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలపై యూపీ ప్రభుత్వానికి నిజంగా శ్రద్ధ ఉంటే.. ప్రభుత్వంపై ఈ వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుధ్ది ఉన్నా.. విపరీతమైన ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, గుంతలమయమైన రోడ్లు, పేదలు ఇలాంటి సమస్యలపై ప్రకటనలు వచ్చేవి. విద్య, ఆరోగ్యం, శాంతిభద్రతల పట్టింపే లేదు’’ అంటూ యోగి ప్రభుత్వంపై మాయావతి మండిపడ్డారు.

West Bengal: మమతకు గట్టి ఎదురుదెబ్బ.. ఒక్కసారిగా షాకిచ్చిన బీజేపీ

ట్రెండింగ్ వార్తలు