West Bengal: మమతకు గట్టి ఎదురుదెబ్బ.. ఒక్కసారిగా షాకిచ్చిన బీజేపీ

టీఎంసీ వరుస విజయాలు నమోదు చేస్తూ.. ఎక్కడా బీజేపీకి చాన్స్ ఇవ్వకుండా వస్తోంది. ఈ తరుణంలో భేకూటియా సమాబే కృషి సమితి కో-ఆపరేటివ్ సొసైటీకి జరిగిన ఎన్నికల్లో ఒక్కసారిగా షాక్ తగిలినట్లైంటి. వాస్తవానికి నందిగ్రామ్‌లో సువేందు అధికారి కుటుంబానికి గట్టిపట్టుంది. సువేందు తండ్రి శిశిర్ ఎంపీ. మన్మోహన్ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. సువేందు సోదరుడు దిబ్యేందు అధికారి కూడా ఎంపీ. వీరిద్దరూ తృణమూల్ ఎంపీలే అయినా బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారు.

West Bengal: మమతకు గట్టి ఎదురుదెబ్బ.. ఒక్కసారిగా షాకిచ్చిన బీజేపీ

BJP wins 11 out of 12 seats in Nandigram co operative body election

Updated On : September 19, 2022 / 5:22 PM IST

West Bengal: దశాబ్ద కాలానికి పైగా వరుస విజయాలతో ఓటమి ఎరుగకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మొట్టమొదటిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా నందిగ్రామ్‭ నియోజకవర్గంలోని భేకూటియా సమాబే కృషి సమితి కో-ఆపరేటివ్ సొసైటీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘోరాతిఘోరమైన ఓటమిని చవి చూసింది. మొత్తం 12 స్థానాలకు గాను బీజేపీకి 11 స్థానాలు గెలుచుకోగా, టీఎంకే ఒకటంటె ఒకటే సీటు గెలుచుకుంది.

కొద్ది రోజుల క్రితం జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒకప్పుడు మమతకు కుడి భుజంగా ఉండి, ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్లిన సువేందు అధికారి ఈ స్థానం నుంచి మరోమారు బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వాస్తవానికి బెంగాల్‮‭లో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి మమతకు ఇదే మొట్టమొదటి ఓటమి కాగా, ఆ ఎన్నికల్లో టీఎంసీ 200లకు పైగా స్థానాలు గెలుచుకుని ఆల్ టైం రికార్డ్ మెజారిటీని సాధించింది.

ఆ తర్వాత నుంచి జరిగే స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో టీఎంసీ వరుస విజయాలు నమోదు చేస్తూ.. ఎక్కడా బీజేపీకి చాన్స్ ఇవ్వకుండా వస్తోంది. ఈ తరుణంలో భేకూటియా సమాబే కృషి సమితి కో-ఆపరేటివ్ సొసైటీకి జరిగిన ఎన్నికల్లో ఒక్కసారిగా షాక్ తగిలినట్లైంటి. వాస్తవానికి నందిగ్రామ్‌లో సువేందు అధికారి కుటుంబానికి గట్టిపట్టుంది. సువేందు తండ్రి శిశిర్ ఎంపీ. మన్మోహన్ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. సువేందు సోదరుడు దిబ్యేందు అధికారి కూడా ఎంపీ. వీరిద్దరూ తృణమూల్ ఎంపీలే అయినా బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారు.

సువేందు బీజేపీలో చేరి గట్టిగా సవాలు విసురుతుండటంతో నందిగ్రామ్‌లో చేసే ప్రతి పోటీనీ టీఎంసీతో పాటు మమత కూడా ప్రతిష్టగా తీసుకుంటారు. అలా తీసుకున్న రెండు సార్లూ మమతా చతికిల పడ్డారు. తాజాగా భెకూటియా సమాబే కృషి సమితి కోఆపరేటివ్ బాడీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడంతో తృణమూల్‌ వర్గాలు డీలా పడిపోయాయి. సువేందుపై ఎలాగైనా గెలవాలనుకున్న మమతకు మరోసారి ఆశాభంగం ఎదురైంది. మమతను మరోసారి ఓడించిన కమలనాథులు సంబరాల్లో మునిగిపోయారు.

Sukhbir Singh Badal: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‭పై మళ్లీ ఊపందుకున్న తాగుబోతు ఆరోపణలు.. టార్గెట్ చేసిన అకాలీ దళ్ చీఫ్