Maharashtra Politics: శివసేనపై మెత్తబడ్డ బీజేపీ.. అన్నదమ్ముల ఫైట్ అంటూ కవరింగ్

అవన్నీ సర్వసాధారణంగా జరిగేవే. ఇప్పులు అలాంటిది ఒకటి పత్రిక ప్రకటన ద్వారా వచ్చింది. అయితే పరిస్థితి బయటికి జరిగే ప్రచారంలా ఏమీ లేదు. మేము బాగానే ఉన్నాం. అంతే కాకుండా మేము ఈ చర్చను ఇంతటితో ముగిద్దామని అనుకుంటున్నామని మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ చంద్రశేఖర్ అవంకులీ అన్నారు.

Shinde sena vs BJP: ‘దేశంలో మోదీ, రాష్ట్రంలో షిండే’ శీర్షికతో మంగళవారం శివసేన పార్టీ ఇచ్చిన పత్రికా ప్రకటన శివసేన, భారతీయ జనతా పార్టీల మధ్య వివాదాన్ని తెచ్చి పెట్టింది. షిండే వర్గంపై అంతర్గతంగా బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. కొంతమంది సానుభూతిపరులు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. అయితే ఈ డ్యామేజీని కంట్రోల్ చేయడానికి బుధవారం మరో పత్రికా ప్రకటన ఇచ్చింది శివసేన. అందులో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‭తో షిండే సమాన హోదాలో ఉన్నట్లు, అలాగే వారు సఖ్యతతో ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేశారు.

Ghulam Nabi Azad: విపక్షాల ఐక్యత అంత ఈజీకాదు.. సీఎం జగన్ గురించి ప్రస్తావిస్తూ గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు

అయితే బీజేపీ సైతం ఈ వివాదంపై కాస్త మెత్తబడ్డట్టుగానే కనిపిస్తోంది. తాజాగా మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ చంద్రశేఖర్ అవంకులీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అనేక గొడవలు ఉంటాయి. అవన్నీ సర్వసాధారణంగా జరిగేవే. ఇప్పులు అలాంటిది ఒకటి పత్రిక ప్రకటన ద్వారా వచ్చింది. అయితే పరిస్థితి బయటికి జరిగే ప్రచారంలా ఏమీ లేదు. మేము బాగానే ఉన్నాం. అంతే కాకుండా మేము ఈ చర్చను ఇంతటితో ముగిద్దామని అనుకుంటున్నాం’’ అని అన్నారు.

Delhi: కోచింగ్ సెంటర్‭లో అగ్ని ప్రమాదం.. కిటికీల నుంచి బయటికి దూకిన విద్యార్థులు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మంగళవారం అనేక వార్తాపత్రికలలో “దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్రకు ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే” అనే శీర్షికతో పూర్తి పేజీ ప్రకటనను ఇచ్చింది. రాష్ట్రంలో నిర్వహించిన ఒక సర్వేలో తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ కంటే షిండేకు ఎక్కువ మంది మద్దతు లభించిందట. ఆ అంశాన్ని ఊటంకిస్తూ (ఫడ్నవీస్ పేరు ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు) ఇచ్చిన పత్రికా ప్రకటన తాజాగా రాజకీయ వివాదానికి దారి తీసింది.

Pawan Kalyan: వైసీపీ నేతల దూషణలను ఆహ్వానిస్తున్నా.. నేను చేతలతో బదులిస్తా చూడు..: పవన్ వార్నింగ్

“ముఖ్యమంత్రి పదవి కోసం, మహారాష్ట్రలో 26.1 శాతం మంది ప్రజలు ఏక్‭నాథ్ షిండేను కోరుకోగా, 23.2 శాతం మంది ప్రజలు దేవేంద్ర ఫడ్నవీస్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు” అని ప్రకటనలో పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వంతో ప్రధాన భాగస్వామి అయిన ఫడ్నవీస్ గురించి ఉద్దేశపూర్వకంగా ఈ ప్రకటన వేశారని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫడ్నవీస్ సైతం ఈ ప్రకటనతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. అయితే ఫడ్నవీస్‭ను బీజేపీ వర్గాన్ని బుజ్జగించేందుకు బుధవారం మరో ప్రకటన వేసింది కానీ, అది ఎంత ఫలిస్తుందో చూడాలి మరి.

Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై హైకమాండ్ కీలక నిర్ణయం

క్రితం సర్వేను ఊటంకిస్తూ రాష్ట్రంలోని 49.3 శాతం ప్రజలు ఏక్‭నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఓటేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇదే కాకుండా ఇంతకు ముందు ప్రకటనలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే ఫొటో లేదు. కేవలం శివసేన ఎన్నికల గుర్తు మాత్రమే ఉంది. అయితే తాజా ప్రకటనలో బాల్ థాకరే సహా సీనియర్ నేత ఆనంద్ దిఘే ఫొటో కూడా వేశారు. ఇక మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫొటో కూడా వేశారు. ఇక తాజా ప్రకటనలో షిండే, ఫడ్నవీస్‭లు అభివృద్ధి అభివాదం చేస్తున్న ఫొటోను ముద్రించారు. శివసేన పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణంతో పాటు భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు కమలాన్ని కూడా వేశారు.

ట్రెండింగ్ వార్తలు