BSP MP Danish Ali: బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం.. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ సంచలన నిర్ణయం

సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ వంటి నినాదాలు ఇచ్చే పార్టీ ఇదే. ఇదీ దేశ పార్లమెంట్ పరిస్థితి. పార్లమెంట్ నుండి వీధుల వరకు బిజెపి ముస్లిం సమాజంపై విద్వేషపూరిత ప్రకటనలు చేస్తూ అమాయక ప్రజలను రెచ్చగొడుతోంది

Remarks on Dnish Ali: పార్లమెంట్ వేదికగా బహుజన్ సమాజ్ పార్టీ నేత, ఎంపీ డానిష్ అలీపై భారతీయ జనతా పార్టీ నేత, ఎంపీ రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం లేసింది. అనుచితమైన భాషతో సహచర ఎంపీని దూషిస్తూ, ఆయన మతాన్ని కూడా కించపరిచేలా వ్యాఖ్యానించారు. ‘ముల్లా ఉగ్రవాది’, ‘సున్తీ’ లాంటి పదాలను ఉపయోగించారు. దీంతో బీజేపీ ఎంపీ బిధూరిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, ఈ అంశంపై బహుజన్ సమాజ్ పార్టీ నేత, ఎంపీ డానిష్ అలీ స్పందించారు. ఎంపీ బిధూరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తాను సభను వీడతానంటూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. బిధూరిపై స్పీకర్ చర్యలు తీసుకుంటారని తనకు నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రయాన్-3 విజయంపై సెప్టెంబర్ 21న రాత్రి 11 గంటలకు లోక్‌సభలో చర్చ జరుగుతోంది. సౌత్ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి సభలో మాట్లాడడుతున్నారు? ఆ సమయంలో బిధూరి ప్రకటనతో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ విభేదించారు. దీంతో సహనం కోల్పియిన బిధురి అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారు.

Gone Prakash : మధుయాష్కిని టార్గెట్ చేసిన గోనె ప్రకాష్ .. అమెరికాలో అంట్లు తోమారు అంటూ సంచలన వ్యాఖ్యలు

ఇక బిధూరి వ్యాఖ్యలపై విపక్షాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. దీనిపై బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి స్పందిస్తూ.. ‘‘సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను స్పీకర్ రికార్డు నుంచి తొలగించాలి. హెచ్చరించినా, సభలో క్షమాపణలు చెప్పకపోవడం బాధాకరం. ఆయనపై ఇంకా తగిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం’’ అని ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు.

ఇక ఆ పార్టీ నేషనల్ కోర్డినేటర్ ఆకాష్ మరింత తీవ్ర స్వరంతో స్పందించారు. ‘‘ఓ బీజేపీ గూండా పార్లమెంటులో ఒక ఎంపీని కిరాతకుడు, ముల్లా, ఉగ్రవాది అన్నప్పటికీ దేశ ప్రధాని, ఆయన పార్టీ ఇంకా మౌనంగానే కూర్చున్నారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ వంటి నినాదాలు ఇచ్చే పార్టీ ఇదే. ఇదీ దేశ పార్లమెంట్ పరిస్థితి. పార్లమెంట్ నుండి వీధుల వరకు బిజెపి ముస్లిం సమాజంపై విద్వేషపూరిత ప్రకటనలు చేస్తూ అమాయక ప్రజలను రెచ్చగొడుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, లోక్‌సభ స్పీకర్ ఒంబిర్లాకు కొంచెం కూడా సిగ్గు మిగిలి ఉంటే, వెంటనే రమేశ్ బిధూరి లాంటి గూండాల పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలి’’ అని ఆకాష్ ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు