Karnataka: జర్నలిస్టులకు స్వీటు బాక్సుల్లో నగదు బహుమతులు.. సీఎంపై కాంగ్రెస్ ఆరోపణలు

ఈ విషయమై న్యాయపరమైన విచారణ జరగాలని, సీఎంపై దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పది మందికి పైగా జర్నలిస్టులకు ఈ నజరానాలను అందుకున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ వాటిని ముఖ్యమంత్రి కార్యాలయం వెనకే తీసుకున్నట్లు జర్నలిస్టులు వెల్లడించనట్లు చెబుతున్నారు. ఈ విషయమై రాష్ట్ర అవినీతి నిరోదక గ్రూపు.. కర్ణాటక లోకాయుక్తలో సీఎం బొమ్మై సలహాదారుపై ఫిర్యాదు చేసింది.

Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై కొద్ది రోజులుగా ‘పీసీఎం’ అంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దాడి చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పనులు జరగాలంటే 40 కమిషన్ ఇవ్వాలని అధికార పార్టీపై విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగా ఈ క్యాంపెయిన్ ప్రారంభించారు. కాగా, తాజాగా ఈ ‘పీసీఎం’ క్యాంపెయిన్‭లో కొత్త అంశాన్ని జోడించారు. జర్నలిస్టులకు సీఎం బొమ్మ నగదు కవర్లు పంచారని ఆరోపించారు. దిపావళి రోజున కొంత మంది జర్నలిస్టులకు లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షల వరకు ఉన్న స్వీట్ బాక్సులను ఇచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

కాగా, ఈ విషయమై న్యాయపరమైన విచారణ జరగాలని, సీఎంపై దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పది మందికి పైగా జర్నలిస్టులకు ఈ నజరానాలను అందుకున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ వాటిని ముఖ్యమంత్రి కార్యాలయం వెనకే తీసుకున్నట్లు జర్నలిస్టులు వెల్లడించనట్లు చెబుతున్నారు. ఈ విషయమై రాష్ట్ర అవినీతి నిరోదక గ్రూపు.. కర్ణాటక లోకాయుక్తలో సీఎం బొమ్మై సలహాదారుపై ఫిర్యాదు చేసింది.

ఒక మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘నాకు సీఎంవో నుంచి స్వీట్ బాక్స్ అందింది. అయితే అది తెరిచి చూడగానే స్వీట్లతో పాటు లక్ష రూపాయల నగదు ఉంది. ఒక్కసారిగా షాక్ అయ్యాను. వెంటనే మా ఎడిటర్‭కు సమాచారం ఇచ్చాను. అంతే కాదు, ఆ స్వీట్ బాక్స్ తీసుకోనని సీఎం ఆఫీసులోనే ఇచ్చేశాను’’ అని పేర్కొన్నారు. ఈ కథనం ఆధారంగా బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ దాడికి దిగుతోంది.

‘Bar-tailed godwit’ Bird Record : ఓ బుల్లి పిట్ట ప్రపంచ రికార్డ్ .. నాన్‌స్టాప్‌గా 13,560 కిలోమీటర్లు ప్రయాణించిన పక్షి

ట్రెండింగ్ వార్తలు