Lakshmi Narayana : కవిత అరెస్ట్.. తర్వాత ఏం జరగనుంది? సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రియాక్షన్

ఆ సమయంలో అరెస్ట్ చేయడానికి కారణాలను సంబంధిత మేజిస్ట్రేట్ ముందు పెట్టాల్సి ఉంటుంది.

CBI Ex JD Lakshmi Narayana on Kavitha Arrest

Lakshmi Narayana : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ లక్ష్మీ నారాయణ ఏమన్నారంటే..

” సుప్రీంకోర్టు 161 సీఆర్పీసీ .. మహిళలు విచారణ సంస్థల అధికారుల దగ్గరికి వెళ్లాల్సిన అసవరం ఉండదు. వారు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి విచారణ చేయాలన్నది ప్రోసీజర్. అప్పుడు కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి పిలిచారు. ఆ సందర్భంలో వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సీఆర్పీసీ పోలీసు, సీబీఐ దగ్గరికి మహిళలను ప్రశ్నించేటప్పుడు మహిళలను పిలవడానికి అవకాశం లేదు. వాళ్లున్న ప్రదేశానికే వెళ్లాలి. పీఎంఎల్ ఏ యాక్ట్, సీఆర్పీసీ రెండూ వేర్వేరు. కాబట్టి ఈడీ ఎవరినైనా పిలవొచ్చు అన్నది వారి వాదన. ఈ రెండింటి గురించి క్లారిటీ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది.

అయితే ఆ మ్యాటర్ సుప్రీంకోర్టు ఇంకా డిసైడ్ చేయలేదు. ఆ కేసు 19వ తేదీకి వాయిదా పడింది. ఇంకా ఎలాంటి ఆర్డర్ రాలేదు. ఒక కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం విచారణ సంస్థకు ఉంటుంది. అది సీబీఐ కావొచ్చు, ఈడీ కావొచ్చు, లోకల్ పోలీస్ కావొచ్చు. కవితను అరెస్ట్ చేశాక ఢిల్లీలో మేజిస్ట్రేట్ ఎదురుగా ప్రొడ్యూస్ చేయాలి.

ఆ సమయంలో అరెస్ట్ చేయడానికి కారణాలను సంబంధిత మేజిస్ట్రేట్ ముందు పెట్టాల్సి ఉంటుంది. కవిత అడ్వకేట్ కూడా వాదనలు వినిపించాలి. ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని, విచారణ సంస్థకు మేము సహకరిస్తున్నాము, అయినా ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని వాదిస్తారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత మేజిస్ట్రేట్ లేదా జడ్జి నిర్ణయం తీసుకుంటారు” అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం భారీ భద్రత నడుమ ఢిల్లీకి తరలిస్తున్నారు. ఈడీ అరెస్ట్ తర్వాత పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన కవిత.. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామని.. చట్టంపై నమ్మకంతోనే ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ రేపు ఛాలెజ్ పిటిషన్ వేయనున్నారు.

మనీలాండరింగ్ చట్టం కింద కవితను అరెస్ట్ చేసినట్లు ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు ఇచ్చిన అరెస్ట్ నోటీసుల్లో ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఇవాళ(మార్చి 15) సాయంత్రం 5.20 గంటలకు కవితను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. అరెస్ట్ కు గల కారణాలపై 14 పేజీలతో కూడిన మెమోను కవితకు అందించింది ఈడీ.

Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఆమె ఇంటి వద్ద హైటెన్షన్

ట్రెండింగ్ వార్తలు