చంద్రబాబు కీలక నిర్ణయం.. నూజివీడు టీడీపీ ఇంఛార్జిగా పార్థసారధి నియామకం

ముద్దరబోయినకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది టీడీపీ అగ్రనాయకత్వం. బుజ్జగించేందుకు ప్రయత్నాలు కూడా చేసింది. కానీ, ముద్దరబోయిన రాజీపడలేదు. అంతేకాదు.. ఏకంగా నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకి వెళ్లి సీఎం జగన్ ను కూడా కలిశారు.

Chandrababu Naidu Key Decision

Chandrababu Naidu : నూజివీడు టీడీపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. నూజివీడు టీడీపీ ఇంఛార్జిగా పార్థసారధిని ప్రకటించారు. నూజివీడు నుంచి టీడీపీ తరపున ఆయన పోటీ చేయనున్నారు. కాగా, నూజివీడు టీడీపీ ఇంఛార్జ్ గా మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఉన్నారు. నూజివీడు టికెట్ పార్థసారథికి ఇస్తున్నట్లు ఖరారు కావడంతో ముద్దరబోయిన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే, ముద్దరబోయినకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది టీడీపీ అగ్రనాయకత్వం. బుజ్జగించేందుకు ప్రయత్నాలు కూడా చేసింది. కానీ, ముద్దరబోయిన రాజీపడలేదు. అంతేకాదు.. ఏకంగా నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకి వెళ్లి సీఎం జగన్ ను కూడా కలిశారు. ఈ పరిణామంతో చంద్రబాబు కీలక నిర్ణయం తీసేసుకున్నారు. ముద్దరబోయిన సీఎంవోకు వెళ్లడంతో.. పార్దసారధిని నూజివీడు టీడీపీ ఇంఛార్జిగా నియమించారు.

పార్థసారథి వైసీపీ టికెట్ మీద పెనమలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఈసారి పెనమలూరు టికెట్ ఆయనకు దక్కలేదు. దీంతో టీడీపీ తరపున నూజివీడు నుంచి బరిలోకి దిగనున్నారు.

నూజివీడు టీడీపీ ఇంఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన..గత కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొలుసు పార్థసారథికి నూజివీడు టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం మొదలైన రోజు నుంచి ముద్దరబోయిన అసంతృప్తిగా ఉన్నారు. తనకు కాకుండా పార్థసారథికి టికెట్ ఇస్తారనే సమాచారం అందడంతో.. పార్టీ మారేందుకు ముద్దరబోయిన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు మోసం చేశారు అంటూ కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత వెళ్లి సీఎం జగన్ ను కూడా కలిశారాయన.

Also Read : కూటమితో ఇన్ని కష్టాలా? టీడీపీ నేతలకు తలనొప్పిగా మారిన పొత్తులు..!