నాకు ఇంగ్లీష్ రాదు…జగన్ ఇంగ్లీష్ లోనే పుట్టాడు : చంద్రబాబు

సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 2430ను చంద్రబాబు చదివారా లేక చదివినా ఇంగ్లీష్ అర్థం కాలేదా అన్న సీఎం వ్యాఖ్యాలపై బాబు మండిపడ్డారు.

  • Publish Date - December 12, 2019 / 05:13 AM IST

సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 2430ను చంద్రబాబు చదివారా లేక చదివినా ఇంగ్లీష్ అర్థం కాలేదా అన్న సీఎం వ్యాఖ్యాలపై బాబు మండిపడ్డారు.

సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 2430ను చంద్రబాబు చదివారా లేక చదివినా ఇంగ్లీష్ అర్థం కాలేదా అన్న సీఎం వ్యాఖ్యాలపై బాబు మండిపడ్డారు. తనకు ఇంగ్లీష్ రాదని…జగన్ ఇంగ్లీష్ లోనే పుట్టాడని ఎద్దేవా చేశారు. దేశంలోని మీడియా అంతా 2430 జీవో తప్పు అంటుందని..అంటే దేశంలో ఎవరికీ ఇంగ్లీష్ రాదా అని ప్రశ్రించారు. ఏపీ అసెంబ్లీలో 2430 జీవోపై చర్చ జరిగిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జాతీయ ప్రతికలకు కూడా జగనే ఇంగ్లీష్ నేర్పించాడని వ్యాంగాస్త్రాలు సంధించారు. సీఎం పదే పదే తనకు ఇంగ్లీష్ రాదని చులకనగా మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదని హితవు పలికారు. 

పత్రికాస్వేచ్ఛను కాపాడటానికి అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవోను రద్దు చేశారని గుర్తు చేశారు. పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం సరికాదన్నారు. మీడియాకు కంట్రోల్ చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. తెల్ల పేపర్లు పట్టుకుని సభలోకి వస్తుంటే తనను అడ్డుకుంటున్నారని తెలిపారు. ప్లకార్డులు వద్దంటే సరే అన్నాం.. కానీ నల్ల రిబ్బన్ లు కూడా పెట్టుకోకూడాదా అని ప్రశ్నించారు. కొత్త మార్షల్ అనుకుంటా..తన చేయి పట్టుకుని తోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

అంతకముందు సీఎం జగన్ మాట్లాడుతూ జీవో నెంబర్ 2430 ను రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుందన్నారు. జీవోను రద్దు చేయాలని చంద్రబాబు అడగడం అశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఈ జీవోలో ఏం తప్పుందో చెప్పాలన్నారు. తప్పుడు వార్తలు రాసినా, జరగనిది జరిగినట్లు రాసినా ఊరక ఉండాలా అన్నారు. న్యాయము ఉండదా అని నిలదీశారు. 
జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.