Chandrababu Naidu : బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు ఆవశ్యకతను కార్యకర్తలకు వివరించాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించారు చంద్రబాబు.

Chandrababu Naidu On Alliance With BJP

Chandrababu Naidu : టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనసేన-బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పొత్తులు పెట్టుకున్నామని వివరించారు. ఎవరైనా సీట్లు కోల్పోవాల్సి వస్తే నిరుత్సాహ పడొద్దని సూచించారు చంద్రబాబు. సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు ఆవశ్యకతను కార్యకర్తలకు వివరించాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించారు చంద్రబాబు.

ఢిల్లీలో జరుగుతున్న పొత్తు చర్చలకు సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని పార్టీ ముఖ్య, సీనియర్ నేతలకు వివరించారు చంద్రబాబు. ఢిల్లీలో వెళ్లిన దగ్గరి నుంచి రెండు దఫాలు అమిత్ షాను కలిశారు చంద్రబాబు. ఆ చర్చల వివరాలను చంద్రబాబు తెలిపారు. చర్చల సారాంశాన్ని, పొత్తుల విషయాన్ని చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు. పవన్ కల్యాణ్ తో కలిసి అమిత్ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని చంద్రబాబు తెలియజేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, గత ఐదేళ్లుగా రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైంది, రాష్ట్రం కనుక గాడిలో పడాలంటే.. కేంద్రం సహకారం లేకుండా ముందుకెళ్లడం అసాధ్యం అని, ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ సహకారం అవసరం అని, అందుకే విస్తృత ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కలవాల్సి ఉంటుందని చంద్రబాబు వారికి వివరించారు.

టికెట్ దక్కని సీనియర్లు ఎవరూ అధైర్య పడొద్దని చంద్రబాబు సూచించారు. కొంతమంది సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుందన్న చంద్రబాబు.. వారికి భవిష్యత్తులో ప్రభుత్వం వచ్చాక అనేక విధాలుగా పదవులు, అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీలు కావొచ్చు, రాజ్యసభ్య సభ్యులు కావొచ్చు.. ప్రభుత్వం వచ్చాక అనేక పదవులు అందుబాటులో ఉంటాయని, వారి స్థాయిని బట్టి పదవులు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.

సీనియర్ నేతలు చొరవ తీసుకుని సీట్లు కోల్పోయే వారికి నచ్చ చెప్పాలని, అందరూ కూడా పొత్తులకు సహకరించాలని.. టీడీపీ-జనసేన-బీజేపీ మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు తేల్చి చెప్పారు. పొత్తులతో ముందుకెళ్తున్నాం, 2024 లో కచ్చితంగా అధికారంలోకి వస్తాం అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం వచ్చాక సరైన అవకాశాలు, పదవులు కల్పిస్తామని టీడీపీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.

Also Read : సీట్ల సర్దుబాటుపై ముగిసిన చర్చలు.. బీజేపీ, జనసేన పార్టీలు పోటీచేసే ఎంపీ స్థానాలు ఇవే!?

 

ట్రెండింగ్ వార్తలు