అమరావతి: వైసీపీ అధినేత హైదరాబాద్ లోని తన అక్రమాస్తులను కాపాడుకోవడానికే కేసీఆర్ భజన చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. సొంత లాభాల కోసమే జగన్,
అమరావతి: వైసీపీ అధినేత జగన్.. హైదరాబాద్ లోని తన అక్రమాస్తులను కాపాడుకోవడానికే కేసీఆర్ భజన చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. సొంత లాభాల కోసమే జగన్, కేసీఆర్.. మోడీతో స్నేహం చేస్తున్నారని విమర్శించారు. తప్పులు చేసే వ్యక్తికి ఎవరైనా ఒక్క ఛాన్స్ ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తమ్ముళ్లకు దిశానిర్దేశం చేశారు.
Read Also : గెలిస్తే ఏం చేస్తానంటే : గాజువాక నియోజకవర్గ జనసేన మేనిఫెస్టో
అందరూ కష్టపడి పని చేయాలని.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 25ఎంపీ సీట్లు, 150కిపైగా అసెంబ్లీ సీట్లు సాధించాలన్నారు. వైసీపీ మైండ్ గేమ్ లను చిత్తు చేయాలన్నారు. ఓట్ల దొంగలు, ఈవీఎం దొంగలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. పార్టీకి ఎక్కువ ఓట్లు తెచ్చినవారికే పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎన్నికల ప్రచారం బాగా జరుగుతోందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రచారంలో టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. టీడీపీ సభలకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని, అధికారం అప్పగించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. ముఖ్యంగా మహిళల నుంచి ఆదరణ లభిస్తోందన్నారు.
వాస్తవాలు ప్రజలకు తెలుసు అన్న చంద్రబాబు.. వైసీపీ హత్యా రాజకీయాలు, జగన్ క్యారెక్టర్ ఏంటో అందరికి తెలుసు అన్నారు. అలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే రాష్ట్రం ఏమైపోతుందో అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. హత్యా రాజకీయాల్లో జగన్ సిద్ధహస్తుడు అని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అభ్యర్థులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని, దాడులకు తెగబడుతున్నారని, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
Read Also : రాహుల్ పీఎం కాగానే భార్యకు భరణం ఇస్తా : కోర్టులో భర్త వాదన
తండ్రికి ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని మింగేశారని, ఇప్పుడు కొడుక్కి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా తినేస్తాడో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారని చంద్రబాబు అన్నారు. కేసీఆర్ తో కుమ్మక్కైన జగన్.. ఏపీకి లక్ష కోట్ల రూపాయల నష్టం కలిగించారని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ని అడ్డుకునేందుకు పదే పదే కేసులు వేసే కేసీఆర్ తో జగన్ దోస్తీ చెయ్యడం దారుణం అన్నారు. జగన్ మోడీ భజన బీజేపీ నేతలను మించిపోయిందని చంద్రబాబు విమర్శించారు. లోటస్ పాండ్ లాభాల కోసం జగన్ ఏపీకి అన్యాయం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
Read Also : కాంగ్రెస్‌కి బిగ్ షాక్ : పొంగులేటి సుధాకర్ రెడ్డి రాజీనామా