టూర్ షెడ్యూల్ : డిసెంబర్ 11న గజ్వేల్‌కు సీఎం కేసీఆర్ 

  • Publish Date - December 8, 2019 / 01:25 AM IST

సీఎం కేసీఆర్ 2019, డిసెంబర్ 11వ తేదీ బుధవారం గజ్వెల్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో కొత్తగా నిర్మించిన ఇంట్లోకి కేసీఆర్ గృహ ప్రవేశం చేస్తారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. 

ఉదయం 11 గంటలకు ములుగులో నిర్మించిన తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ, హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రారంభం. 

తమిళనాడులోని మెట్టుపాలయంలో అక్కడి ప్రభుత్వం ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేసింది. దీని ఫలితంగా అక్కడ నుంచి దాదాపు 120 మంది ఐఎఫ్ఎస్ అధికారులుగా ఎంపికయ్యారు. దీన్ని స్పూర్తిగా తీసుకుని తెలంగాణ విద్యార్థులను కూడా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం  2016లో తెలంగాణ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ములుగులో భవన సముదాయాన్ని నిర్మించింది. 

ములుగులోనే ఉద్యానవాల అభివృద్ధి, పరిశోధన కోసం హర్టికల్చర్ యూనివర్సిటీన భవన సముదాయం ప్రారంభం. 

సీఎం పర్యటన సందర్భంగా తీసుకునే ఏర్పాట్లపై ఆర్థికమంత్రి హరీష్‌రావు సమీక్షించారు. గజ్వేల్‌లోని సమీకృత మార్కెట్‌, ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌, మహతి ఆడిటోరియం హాల్‌ను మంత్రి సాయంత్రం జిల్లా కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌లతో కలిసి పరిశీలించారు. అనంతరం గజ్వేల్‌లోని సీఎం క్యాంపు ఆఫీసులో సీఎం పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌, తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, తదితర విషయాలపై చర్చించారు. 
Read More : మీటింగ్ టైం : డిసెంబర్ 11న టి.కేబినెట్