బీఆర్ఎస్‌లో జూనియర్ ఆర్టిస్టులు.. కేటీఆర్, హరీశ్‌లపై సీఎం రేవంత్ సెటైర్లు

తెలంగాణ.. కవులు, కళాకారులకి నిలయం అనుకున్నా. నటులకు కూడా నిలయం అని ఇవాళ అర్థమైంది. ఇంకొక నటుడు వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుకున్నాడు. పది పైసలతో అగ్గిపెట్టె కొనుక్కోలేకపోయాడు.

CM Revanth Reddy Satires On BRS Leaders

CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ టార్గెట్ గా చెలరేగిపోయారు. బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ నేతలపై సెటైర్లు వేసి సభలో నవ్వులు పూయించారు రేవంత్ రెడ్డి.

కేటీఆర్, హరీశ్ రావులపై సెటైర్లు వేశారు సీఎం రేవంత్ రెడ్డి. ”ఆటో రాముడు జూనియర్ ఆర్టిస్ట్ లాగా డ్రామాలు చేశారు. ఆటోలో వెళ్లి కేటీఆర్ నాటకాలు చేశారు. ఆటోలో కెమెరాలు పెట్టుకొని ప్రీ ప్లాన్డ్ గా ఆటోలో తిరిగి ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ.. కవులు, కళాకారులకి నిలయం అనుకున్నా. నటులకు కూడా నిలయం అని ఇవాళ అర్థమైంది. ఇంకొక నటుడు వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుకున్నాడు. పది పైసలతో అగ్గిపెట్టె కొనుక్కోలేకపోయాడు.

మీ ఆనవాళ్లు లేకుండా చేసే జిమ్మెదారి నాది. తొందరలోనే యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ల నియామకం. కొందరు ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చి కలిస్తే వాళ్ళని అనుమానించారు. ముఖ్యమంత్రిగా ప్రతి ఎమ్మెల్యేని కలవడం నా బాధ్యత. నన్ను కలిసిన ఎమ్మెల్యేలను అనుమానించి అవమానించారు. కలిసినంత మాత్రాన వాళ్ళ లాగా పార్టీలో కలుపుకునే ఆలోచన మాకు లేదు. అభివృద్ధి పనుల కోసం తనని ఏ ప్రజాప్రతినిధి కలిసినా వాళ్ళ సమస్యను పరిష్కరిస్తాను.

తొమ్మిదిన్నర సంవత్సరాలలో జయశంకర్ సొంత ఊరు అక్కంపల్లి రెవెన్యూ విలేజ్ గా చేశాం. పార్టీ ఆఫీస్ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో సొంత ఇంటిని ఇస్తే.. ఆయన చనిపోతే పరామర్శించలేదు. గొప్ప నేతలను మేము స్మరించుకుంటాం. కొమురం బీమ్, ఇంద్రవెల్లిలో స్మృతివనం ఏర్పాటు చేశాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.