Gudivada Amarnath : హైదరాబాద్‌లో మైక్రోసాప్ట్ కంపెనీ వస్తే అమెరికాలో మూసేసి వచ్చినట్టా?

Gudivada Amarnath : 2019 నాటికి ప్రభుత్వ ఉద్యోగులు 4 లక్షలు ఉంటే నేడు 6 లక్షల మంది అయ్యారు. రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులు వస్తుంటే ఉద్యోగాలు లేవని పిచ్చి ప్రచారం చేస్తున్నారు.

Gudivada Amarnath : ఏపీలో ఉద్యోగాల భర్తీపై విపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు. గడిచిన నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. కేవలం ఆర్టీసీ ద్వారానే 2 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఎలక్ట్రానిక్, ఐటీ సెక్టార్ లో 30వేల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. అంతేకాదు మరో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించేలా ముందుకు వెళ్తున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.

”రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు వస్తుంటే చంద్రబాబు అండ్ కో కి నచ్చడం లేదు. రాష్ట్రంలో నేడు కీలక ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో నాలుగు పోర్టులు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులు వస్తుంటే ఉద్యోగాలు లేవని పిచ్చి ప్రచారం చేస్తున్నారు. 2019 నాటికి ప్రభుత్వ ఉద్యోగులు 4 లక్షలు ఉంటే నేడు 6 లక్షల మంది అయ్యారు.

Also Read..Gannavaram Assembly Constituency: గన్నవరంలో వంశీ బలమెంత.. పట్టాభి దూకుడు టీడీపీకి మైనస్‌గా మారనుందా?

నాలుగేళ్లలో 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సీఎం జగన్ ఇచ్చారు. కేవలం ఆర్టీసీ ద్వారానే 2లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఎలక్ట్రానిక్, ఐటీ సెక్టార్ లో 30వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. మరో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించేలా ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ది కనిపించడం లేదా..?

దేశంలో పారిశ్రామిక ప్రముఖులు వచ్చి చెబుతున్నా మీకు వినపడదా..? గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ద్వారా వచ్చిన పెట్టుబడుల కార్యాచరణ కోసం చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశాం. అమరరాజా ఫ్యాక్టరీ హైదరాబాద్ లో ప్రారంభిస్తే వీళ్లు ఎందుకు మాట్లాడుతున్నారు? హైదరాబాద్ లో మైక్రోసాప్ట్ కంపెనీ వస్తే అమెరికాలో మూసేసి వచ్చినట్టా?” అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.

Also Read..Naga Babu Konidela : జనసేన అధికారంలోకి వస్తే ఏపీకి స్వర్ణయుగం, పొత్తుల గురించి ప్రశ్నించొద్దు- నాగబాబు

ట్రెండింగ్ వార్తలు