Anantapur Urban Assembly constituency
Anantapur Urban Assembly constituency : అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టికెట్ పై టీడీపీ, జనసేనలో ఉత్కంఠ నెలకొంది. అర్బన్ టికెట్ తమదే అంటూ జోరుగా రెండు పార్టీలూ ప్రచారం చేసుకుంటున్నాయి. గతంలో ఇక్కడి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. పవన్ కల్యాణ్ పోటీ చేస్తే తానే దగ్గరుండి గెలిపిస్తానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడం లేదని తెలియడంతో.. టికెట్ పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో ఈసారి టీడీపీ నుంచి తానే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటానని ప్రభాకర్ చౌదరి అంటున్నారు. మరోవైపు జనసేన నుంచి జేసీ పవన్ రెడ్డి బరిలోకి దిగుతారని జనసేనలో జోరుగా చర్చ సాగుతోంది.
Also Read : టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే? వైసీపీ సిట్టింగ్ ఎంపీలకూ టికెట్లు..!
అనంతపురం అర్బన్ టికెట్ విషయంలో అటు టీడీపీ ఇటు జనసేన నాయకుల మధ్య పోటీ నెలకొంది. పొత్తులో భాగంగా అనంతపురం అర్బన్ టికెట్ జనసేనకే కేటాయిస్తారని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. అదే విధంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికే కచ్చితంగా టికెట్ కేటాయిస్తారని ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. అనంతపురంలో బలిజ సామాజికవర్గం వారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి జనసేనకే టికెట్ కేటాయిస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
Also Read : వైసీపీకి తలనొప్పిగా మారిన ఆ ఏడు ఎంపీ స్థానాలు..!
టికెట్ కోసం జనసేనకు నుంచి ఇద్దరు ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. టికెట్ కోసం పవన్ కల్యాణ్ దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారు. అనంతపురం జనసేన ఇంఛార్జి వరుణ్, శిరిడీ సాయి స్వీట్స్ భవానీ రవికుమార్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక, జేసీ పవన్ రెడ్డి పేరు సైతం తెరపైకి వచ్చింది. పొత్తులో భాగంగా అనంతపురం అర్బన్ నుంచి జనసేన అభ్యర్థిగా జేసీ పవన్ రెడ్డి బరిలోకి దిగనున్నారు అనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవిని కలిసి అనంతపురం టికెట్ విషయమై చర్చించినట్లు సమాచారం. రెండు పార్టీల నేతలు.. టికెట్ మాదే అంటూ మాదే అని ప్రచారం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. టికెట్ ఏ పార్టీకి ఇస్తారు? అభ్యర్థి ఎవరు? అనేది త్వరగా తేల్చాలంటున్నారు కార్యకర్తలు.