వైసీపీకి తలనొప్పిగా మారిన ఆ ఏడు ఎంపీ స్థానాలు..!

కొన్ని స్థానాల్లో మాత్రం తలనొప్పి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఏడు ఎంపీ స్థానాలు వైసీపీ అధినాయకత్వానికి పరీక్షగా మారినట్లు సమాచారం.

వైసీపీకి తలనొప్పిగా మారిన ఆ ఏడు ఎంపీ స్థానాలు..!

YCP MP Candidates

Updated On : February 1, 2024 / 8:33 PM IST

YCP MP Candidates : ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. మార్పులు చేర్పుల్లో భాగంగా ఇప్పటికే 14 స్థానాల్లో సమన్వయకర్తలను నియమించింది వైసీపీ హైకమాండ్. అయితే, కొన్ని స్థానాల్లో మాత్రం తలనొప్పి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఏడు ఎంపీ స్థానాలు వైసీపీ అధినాయకత్వానికి పరీక్షగా మారినట్లు సమాచారం. ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, విజయనగరం, అనకాపల్లి, నర్సాపురం, అమలాపురం స్థానాలపై పీటముడి నెలకొంది.

Also Read : టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే? వైసీపీ సిట్టింగ్‌ ఎంపీలకూ టికెట్లు..!

ఒంగోలు, నెల్లూరు స్థానాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గోదావరి జిల్లాల విషయానికి వస్తే నర్సాపురం, అమలాపురంపై కసరత్తు కొలిక్కిరాలేదు. ఉత్తరాంధ్రలో విజయనగరం, అనకాపల్లిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. రాజంపేట, కడప, బాపట్ల నుంచి సిట్టింగ్ లకే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుపతి ఎంపీ అభ్యర్థిగా.. సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి పేరు ప్రకటించేసింది వైసీపీ అధినాయకత్వం. ఇక, కర్నూలు సమన్వయకర్తగా బీవై రామయ్య పేరు ఖరారైంది.