Karnataka Politics: సిద్ధరామయ్య ప్రమాణస్వీకారానికి ఎవరెవరిని పిలుస్తున్నారో తెలుసా?

కాంగ్రెస్ పార్టీకి విపక్షంగా ఉన్న నేతల్ని కూడా పిలుస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‭లను కూడా పిలుస్తున్నట్లు సమాచారం.

Siddaramaiah oath ceremony: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య శనివారం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. కర్ణాటకకు గతంలో (2013-2018) ఐదేళ్ల పాటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి దేశంలోని బీజేపీయేతర పక్షాలను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నారు ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.

Karnataka Politics: కాంగ్రెస్ అధిష్టానానికి కర్ణాటక సీనియర్ నేత తీవ్ర హెచ్చరిక

బిహార్ నుంచి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ కీలక నేత తేజశ్వీ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, సీపీఐ నుంచి డీ రాజా, సీపీఎం నుంచి సీతారాం ఏచూరిలను ఆహ్వానిస్తున్నారట. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ఐక్యత సాధించే లక్ష్యంలో భాగంగా ఈ నాయకుల్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Prashant Kishore: ఆ పొరపాటు చేయొద్దు.. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై ప్రశాంత్ కిశోర్

ఇక కాంగ్రెస్ పార్టీకి విపక్షంగా ఉన్న నేతల్ని కూడా పిలుస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‭లను కూడా పిలుస్తున్నట్లు సమాచారం. నటుడు కమల్ హాసన్ ప్రత్యేక అతిథిగా హాజరు అవుతున్నారట. 224 మంది సభ్యుల అసెంబ్లీకి మే 10న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలను కైవసం చేసుకొని ఘన విజయాన్ని సాధించింది. అధికార బీజేపీ, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ సెక్యులర్ 66, 19 స్థానాలను గెలుచుకున్నాయి.