Khanapur Municipality
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మన్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ అభ్యర్థికి కౌన్సిలర్లు మద్దుతు తెలిపారు. మొత్తం 12మంది కౌన్సిలర్లు ఉండగా వారిలో బీఆర్ఎస్ లో ఐదుగురు, కాంగ్రెస్ ఐదుగురు, బీజేపీ, ఇండింపెండెంట్ ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ అవిశ్వాసానికి 9మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. దీంతో ఖానాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరుసగా మున్సిపాలిటీలకు సంబంధించి అవిశ్వాస తీర్మానాలు కొనసాగుతున్నాయి. మంచిర్యాల జిల్లాకు సంబంధించి దాదాపు అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఇద్దరూ.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యులే. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12మంది కౌన్సిలర్లు ఉన్నారు. అందులో బీఆర్ఎస్ నుంచి ఐదుగురు గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్ ఒకరు గెలుపొందారు. గతంలో కూడా ఛైర్మన్ రాజేందర్ తో పాటు వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసం పెట్టినప్పుడు వారంతా కోర్టును ఆశ్రయించారు.
Also Read : సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి కౌంటర్ ఇచ్చిన హరీశ్ రావు
ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో వెళ్లారు కాబట్టి.. అవిశ్వాసనం చెల్లదన్నారు. తాజాగా 12మందిలో 9మంది కౌన్సిలర్లు అంతా కలిసి అవిశ్వాస తీర్మానాలు నెగ్గేలా ప్రయత్నాలు చేశారు. అవిశ్వాస తీర్మానం నెగ్గింది. రాజుల సత్యం అనే కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. ఆయనే ఖానాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఛైర్మన్ రాజేందర్, వైస్ ఛైర్మన్ ఖలీల్ అహ్మద్ పదవులు కోల్పోయినట్లు స్పెషల్ ఆఫీసర్ ప్రకటించారు. 12మందిలో 9మంది కౌన్సిలర్ల మద్దతుతో పార్టీలకు అతీతతంగా (బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్) అందరి మద్దతుతో ఏకగ్రీవంగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసం నెగ్గేలా చేసుకున్నారు. త్వరలోనే ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నిక జరగబోతోంది.
Also Read : టీజీగా టీఎస్ మార్పు.. రూ.500కు గ్యాస్ సిలిండర్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు