Telangana: టీజీగా టీఎస్‌ మార్పు.. రూ.500కు గ్యాస్ సిలిండర్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Telangana: టీజీగా టీఎస్‌ మార్పు.. రూ.500కు గ్యాస్ సిలిండర్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

Telangana Ministers

Updated On : February 4, 2024 / 10:04 PM IST

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన తెలంగాణ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

తెలంగాణలో రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు క్యాబినెట్ ఆమోదం చెప్పింది. అలాగే, టీఎస్‌ను టీజీగా మారుస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వాహనాల రిజిస్ట్రేషన్ లో టీఎస్ ను టీజీగా మార్చాలని నిర్ణయించింది.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహంలో, రాష్ట్ర చిహ్నంలో మార్పులకు నిర్ణయించింది. గత బీఆర్ఎస్ పాలనలో నియంతృత్వ పోకడలే తప్ప ప్రజాస్వామ్యం కనపడలేదని తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

ఆరు గ్యారంటీల అమలుపై చర్చించినట్లు తెలిపారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు 100 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గంలో ఆమోదించామని చెప్పారు.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్

  • ఈనెల 8 నుండి బడ్జెట్ సమావేశాలు..
  • ఇందిరమ్మ రాజ్యం.. ప్రజాపాలన.. లక్ష్యంగా ఆరు గ్యారంటీల్లో రెండు అమలు చేశాం…
  • ఇప్పుడు మరో రెండు గ్యారంటీ లకు ఆమోదం
  • అసెంబ్లీ సాక్షిగా.. ఆ రెండు గ్యారంటీలను ప్రకటిస్తాం
  • ప్రజల ఆశలను మేము వమ్ము చేయం
  • విమర్శలు చేస్తున్న వారి నోళ్ళు కు ప్లాస్టర్ వేస్తాం
  • కులగణనకు క్యాబినెట్ ఆమోదించింది
  • దొరపాలన కు దూరంగా తెలంగాణ ఉండాలి
  • Ts స్థానంలో tg ఉండనుంది.. కేబినెట్ ఆమోదం..
  • ఇకనుండి వాహనాల రిజిస్ట్రేషన్ లు tg గా ఉంటాయి
  • తెలంగాణ తల్లి విగ్రహం.. రాచరిక పాలనకు దూరంగా రాష్ట్ర చిహ్నంగా ఉంటుంది
  • అందెశ్రీ గీతం జయ జయ హే… పాటను రాష్ట్ర గీతంగా కేబినెట్ గుర్తించి ఆమోదం తెలిపింది
  • మేధావులు, కవులు కళాకారులు సూచనలతో మార్పులు చేస్తాం

మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్ 

  • కొడంగల్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తాం
  • 65 ఐటీఐ కాలేజ్ లను అప్గ్రేడ్ చేస్తాం… కొత్త కోర్సులు ప్రవేశపెడతాం
  • హైకోర్టుకు 100 ఎకరాలకు కేబినెట్ ఆమోదం
  • క్షమాభిక్ష పొందిన.. ఖైదీల విడుదలకు సంబంధించి సంబంధిత శాఖకు క్యాబినెట్ ఆదేశించింది
  • Tg తోనే వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతాయి
  • నాడు కేంద్రం tg అని గెజిట్ ఇస్తే… Ts పెట్టింది
  • ప్రజా పాలన అద్దం పట్టేలా నిర్ణయాలు ఉన్నాయి
  • ఆరు గ్యారంటీ లలో సందేహాలు అవసరం లేదు… ఇచ్చిన హామీ లను నిలబెట్టుకుంటాం
  • నోటిఫికేషన్ అగ్రికల్చర్ ఏవో నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
  • మిగతా ఉద్యోగాల నోటిఫికేషన్ ల పై పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నాం

Revanth vs Harish: అసెంబ్లీలోనే తేల్చుకుందామన్న రేవంత్.. సై అన్న హరీశ్‌