Telangana Ministers
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన తెలంగాణ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణలో రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు క్యాబినెట్ ఆమోదం చెప్పింది. అలాగే, టీఎస్‌ను టీజీగా మారుస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వాహనాల రిజిస్ట్రేషన్ లో టీఎస్ ను టీజీగా మార్చాలని నిర్ణయించింది.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహంలో, రాష్ట్ర చిహ్నంలో మార్పులకు నిర్ణయించింది. గత బీఆర్ఎస్ పాలనలో నియంతృత్వ పోకడలే తప్ప ప్రజాస్వామ్యం కనపడలేదని తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఆరు గ్యారంటీల అమలుపై చర్చించినట్లు తెలిపారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు 100 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గంలో ఆమోదించామని చెప్పారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్
మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్
Revanth vs Harish: అసెంబ్లీలోనే తేల్చుకుందామన్న రేవంత్.. సై అన్న హరీశ్