ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు అమలు ఎట్టి పరిస్ధితుల్లోనూ సాధ్యం కాదని, అభివృధ్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం అభివృధ్ధి చెందుతుందని ఏపీ క్రెడాయ్ ప్రతినిధులు వివరించారు. సీఎం జగన్ మంగళవారం అసెంబ్లీ లో రాజధానిపై చేసిన ప్రకటన వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొందని వారు అన్నారు. రాయలసీమ వాసులు సచివాలయంలో పనుల కోసం విశాఖ వెళ్లాలంటే సాధ్యమయ్యే పనికాదని వారు అభిప్రాయపడ్డారు.
లోటు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రంలో ఇటువంటి ప్రయోగాలు మంచిది కాదని క్రెడాయ్ ప్రతినిధులు హితవు పలికారు. రాజధానిపై ఏర్పాటు చేసినకమిటీ నివేదిక రాకుండానే ఇలాంటి ప్రకటన చేయటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. అభివృధ్ది వికేంద్రీకరణకు తమ వంతు సహాకారం అందిస్తామన్నారు.
అమరావతిలో ఇప్పటికే సగం పూర్తైన నిర్మాణాలను పూర్తి చేసి పూర్తి స్ధాయి వసతులు కల్పించాలని వారు సీఎంకు సూచించారు. సీఎం జగన్ ప్రకటన వల్ల మూడు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగే అవకాశంఉందనే అభిప్రాయాన్ని క్రెడాయ్ ప్రతినిధులు వ్యక్తం చేశారు.