మున్సిపల్స్..పోలింగ్ శాతం : అలా అయితే..గంగులపై క్రిమినల్ చర్యలు

  • Publish Date - January 24, 2020 / 10:29 AM IST

తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పోలింగ్ శాతం వివరాలను ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. అలాగే..గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మంత్రి గంగుల కారుకు ఓటేశానని చెప్పడాన్ని పరిశీలిస్తున్నామని, అలా చెబితే నేరమే అవుతుందని తెలిపారు. నేరమే అని రుజవు అయితే..మంత్రి గంగులపై క్రిమినల్ చర్యలుంటాయని నాగిరెడ్డి ప్రకటించారు. 

* 2020, జనవరి 24వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి పోలింగ్ స్టార్ట్.
* సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.
* ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు. 
* కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు. 

120 మున్సిపాల్టీలలో 74.40 శాతం పోలింగ్ నమోదైందని తెలంగాణ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. 2014లో 75.85 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ప్రస్తుతం 9 కార్పొరేషన్‌లలో 58.83 శాతం పోలింగ్ రికార్డు అయ్యిందన్నారు. గతంలో కార్పొరేషన్లలో 60.63 శాతం పోలింగ్ నమోదైందన్నారు. 2020, జనవరి 25వ తేదీ సాయంత్రానికి మున్సిపల్ ఫలితాలు వస్తాయని వెల్లడించారు. జనవరి 27వ తేదీన పరోక్ష పద్ధతిలో మేయర్లు, ఛైర్మన్‌ల ఎన్నిక ఉంటుందన్నారు. జనవరి 29వ తేదీన కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక జరుగుతుందన్నారు. 

* రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం.
* మిగిలిన 58 స్థానాలకు ఎన్నికలు. 
* టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ప్రధానంగా పోటీ. 
* బరిలో 369 మంది అభ్యర్థులు.

 

* 337 పోలింగ్ కేంద్రాలు.
* 82 సమస్యాత్మక కేంద్రాలు. 
* పోలీసులతో గట్టి బందోబస్తు.
* 20వ డివిజన్‌లో తుల రాజేశ్వరి, 37వ డివిజన్‌లో చల్ల స్వరూపారాణి ఏకగ్రీవంగా ఎన్నిక. 

* 348 పోలింగ్ కేంద్రాలు. 
* కార్పొరేషన్ పరిధిలో 2, 72, 195 మంది ఓటర్లు. 
* ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్. 
* ఎన్నికల విధుల్లో 2 వేల మంది సిబ్బంది. 
* కరీంనగర్ కార్పొరేషన్ కౌంటింగ్ ప్రక్రియ జనవరి 27న. 

Read More : సీఎం జగన్ ఉన్మాది : బండ బూతులు తిడుతున్నారు – బాబు