ఏపీ రాష్ట్రంలోని ప్రతి పంట ఈ క్రాపు బుకింగ్‌లోకి తీసుకరావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏ సర్వే నెంబర్‌లో ఏ పంట వేశారనేది అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు. ఈ క్రాపు బుకింగ్ చేస్తే మార్కెటింగ్‌ను పటిష్టం చేయగలుగుతామన్నారు. రైతులకు ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించగలుగుతామని, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు ట్యాబ్ లేదా..స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని..ఇందుకు అవసరమైన టెక్నాలజీ రూపొందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఏ కష్టం రాకుండా చూడాలన్నారు. 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం సీఎం జగన్ వ్యవసాయ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి సంబంధించి మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు వివరించారు.
వ్యవసాయ విస్తరణ ఇంకా పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు వ్యవసాయ అధికారులు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పొలాల్లోనే ఉండాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత..నుంచే కార్యాలయాలకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్‌లను మూడు దశల్లో ఏర్పాటు చేయాలన్నారు. విత్తన ఉత్పత్తిలో రైతులను ప్రోత్సాహించాలని, విత్తనాలను రైతుల నుంచి కొనుగోలు చేసి ప్రోసెసింగ్ చేసిన తర్వాత..అందచేయడం జరిగే విధంగా చూడాలన్నారు.
గ్రామస్థాయిలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల షాపులు ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించిన చర్యలు మొదలుపెట్టడం జరిగిందని మంత్రి కన్నబాబు వెల్లడించారు. రాష్ట్రంలో చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సాహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందుకు బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలిపారు. చిరు ధాన్యాలు సాగు చేసే వారికి నగదు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Read More :కంగ్రాట్స్ : దర్మాడికి YSR లైఫ్ ఎచీవ్ మెంట్ అవార్డు