అమరావతి: ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో ఏపీలో ఓటర్ల తుది జాబితాను ఈసీ విడుదల చేసింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3కోట్ల 69లక్షల 33వేల 091.
అమరావతి: ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో ఏపీలో ఓటర్ల తుది జాబితాను ఈసీ విడుదల చేసింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3కోట్ల 69లక్షల 33వేల 091. పురుష ఓటర్ల సంఖ్యతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం విశేషం. పురుష ఓటర్లు కోటి 83లక్షల 24వేల 588 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు కోటి 86లక్షల 4వేల 742 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓట్లు 3వేల 761. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 40లక్షల 13వేల 770 మంది ఓటర్లు ఉండగా… విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 17లక్షల 33వేల 667మంది ఓటర్లు ఉన్నారు. ఏపీ అసెంబ్లీ గడువు జూన్ 18తో ముగియనుంది.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రాగానే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్ర్రక్రియ వివరాలను ఈసీ చీఫ్ ద్వివేది వెల్లడించనున్నారు. రాష్ట్రంలో అనేక కసరత్తులు చేసిన తర్వాత ఓటర్ల తుది జాబితాను ఈసీ ప్రకటించింది. రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను.. టీడీపీ 100 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల లిస్ట్ ని సోమవారం(మార్చి 11) లేదా మంగళవారం(మార్చి 12) అధికారికరంగా ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీ, జనసేన పార్టీలు కూడా అభ్యర్థుల లిస్ట్ ని పూర్తి చేశాయి.