తెలంగాణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2020, ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజున ఓట్లను లెక్కించి..ఫలితాలను ప్రకటిస్తారు. మూడు రోజుల్లోనే..పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సత్వరమే సహకార సొసైటీ ఎన్నికలు చేపట్టాలని 2020, జనవరి 29వ తేదీ బుధవారం సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
* 2020, జనవరి 30వ తేదీ గురువారం నోటిఫికేషన్ జారీ.
* ఫిబ్రవరి 06వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.
* ఫిబ్రవరి 09వ తేదీ నామినేషన్ల పరిశీలన.
* ఫిబ్రవరి 10వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు.
జిల్లాల వారీగా ఎన్నికలు జరిగే సొసైటీల వివరాలు :-
నిజామాబాద్ 89, ఖమ్మం 76, కామారెడ్డి 55, సంగారెడ్డి 53, జగిత్యాల 51, సూర్యాపేట 47, నల్గొండ 42, రంగారెడ్డి 37, మెదక్ 37, వరంగల్ గ్రామీణ 31, కరీంనగర్ 30, ఆదిలాబాద్ 28, రాజన్న సిరిసిల్ల 24, నాగర్ కర్నూలు 23, వికారాబాద్ 22, సిద్ధిపేట 21, కొత్తగూడెం 21, యాదాద్రి 21, పెద్దపల్లి 20, మంచిర్యాల 20, నిర్మల్ 17, మహబూబాబాద్ 19, మహబూబ్ నగర్ 17, వనపర్తి 15, జనగామ 14, కొమరం భీం 12, ములుగు 12, వరంగల్ గ్రామీణ 12, గద్వాల 11, నారాయణపేట 10, జయశంకర్ 10, మేడ్చల్ 09.
* ఫిబ్రవరి 10వ తేదీన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు.
* ఫిబ్రవరి 15న బ్యాలెట్లతో పోలింగ్.
* ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్.
* ప్రతి సహకార సంఘాన్ని 13 బ్లాకులు చేసి డైరెక్టర్ల ఎన్నిక
* ఎస్సీ 1, ఎస్సీ మహిళ 1, ఎస్టీ 1, బీసీ 2, ఓసీ జనరల్ 7, ఓసీ మహిళ ఒకరు చొప్పున డైరెక్టర్ పదవులకు ఎంపిక.
* సొసైటీలో సభ్యులుగా ఉండే..రైతులు నేరుగా ఎన్నుకొనే ఈ డైరెక్టర్ల సంఘం ఛైర్మన్, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు.