ఏపీ ప్రభుత్వంతో చర్చల తర్వాత ఉద్యోగ సంఘాల నేతల కీలక వ్యాఖ్యలు

పీఆర్సీ కమిషన్ వేసినా ఆయనకు కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీ లేదు. 14వ తేదీన నల్ల బ్యాడ్జీలతో మొదలయ్యే ఆందోళన మార్చి 27న చలో విజయవాడతో ముగుస్తుంది.

AP Government Employees Talks

AP Employees Unions : ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపింది. ఉద్యోగ సంఘాలతో పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చలు జరిపినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. పీఆర్సీనే త్వరితగతిన ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఉద్యోగ సంఘాలు మధ్యంతర భృతి కోరాయని, దానిపై పరిశీలన చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. ఇప్పటికే పీఆర్సీ కమిషన్ వేశామన్నారు.

వెంకటరామిరెడ్డి- సచివాలయం ఉద్యోగుల సంఘం
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరిపినందుకు ధన్యవాదాలు. డీఏ బకాయిలు, మధ్యంతర భృతి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. 5వేల600 కోట్ల మేర బకాయిలు మార్చి 31 నాటికి ఉద్యోగులకు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఏపీజీఎల్ఐ బకాయిలు, సీపీఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ 2వేల 400 కోట్లు పెండింగ్ ఉంది. దీనిని కూడా మార్చి 31 నాటికి జమ చేస్తామంది. 2వేల 250 కోట్ల మేర సరెండర్ లీవ్ లు బకాయిలు ఉన్నాయి. మధ్యంతర భృతిపై సీఎంతో చర్చించి చేస్తామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎక్స్ పీరియన్స్ అలవెన్స్ ఇవ్వాలని కోరాం. పీఆర్సీ బకాయిలపై గతంలో షెడ్యూల్ ఇచ్చారు.

బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్
ఉద్యోగులకు ప్రభుత్వం ఎంత బకాయిలు పడిందో ఈ సమావేశంలో తెలుసుకోగలిగాం. మార్చి నెలాఖరుకు కొన్ని బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. 600 కోట్ల రూపాయలు ఏపీజీఎల్ఐ బకాయిలు ఉన్నాయి. సీపీఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ కూడా 2వేల 500 కోట్ల మేర చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చారు. సరెండర్ లీవ్ బకాయిలు 2వేల 600 కోట్ల వరకూ బకాయి ఉంది. పోలీసులకు 300 కోట్ల బకాయిని మార్చి 31 నాటికి చెల్లిస్తామని చెప్పారు. 5వేల 600 కోట్ల మేర బకాయిలు లిస్టు సమావేశంలో ఇచ్చారు.

మొత్తం ఉద్యోగులకు డీఏ బకాయిలు 7వేల 500 కోట్ల రూపాయల మేర ఉంది. వెరసి ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు పడిన మొత్తం 20వేల కోట్లు. ఆఫీసు నిర్వహణ, ప్రోటోకాల్, 2019 ఎన్నికల బడ్జెట్, లీగల్ వ్యవహారాల డబ్బులు కూడా ప్రభుత్వం బకాయి పడింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు తక్షణం ఉత్తర్వులు ఇవ్వాలి. పోస్టుల మ్యాపింగ్ కాలేదని క్రమబద్దీకరణ చేయడం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనం పెంచాలని కోరాం. ఉద్యోగుల ఆరోగ్య కార్డు కూడా పని చేయడం లేదు. డబ్బులు ట్రస్టుకు ఇచ్చేలా ఉత్తర్వులు వచ్చినా అది అమలు కావడం లేదు. మెడికల్ రీయింబర్స్ మెంట్ చేయాలని కోరాం. తహశీల్దార్ రమణయ్య కుటుంబానికి 50 లక్షల పరిహారం, ఉద్యోగం ఇస్తామని కమిటీ తెలిపింది.

బండి శ్రీనివాస రావు- ఏపీఎన్జీవో అధ్యక్షుడు
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిరుత్సాహపరిచింది. మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది. మధ్యంతర భృతి విషయంలో ప్రభుత్వం స్పందించ లేదు. పీఆర్సీ కమిషన్ వేసినా ఆయనకు కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీ లేదు. 14వ తేదీన నల్ల బ్యాడ్జీలతో మొదలయ్యే ఆందోళన మార్చి 27న చలో విజయవాడతో ముగుస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు