Ch Malla Reddy
Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డి చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు మా కుటుంబం నుంచి మూడు పదవులు ఉండాలి అనుకున్నాం అని ఆయన చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నాడని మల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడని వెల్లడించారు.
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారని మల్లారెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ కావడం కోసమే జగ్గారెడ్డి నా పేరు ఎత్తుతున్నారు అని వ్యాఖ్యానించారు. నా పేరు ఎత్తకపోతే ఆయనను ఎవరూ పట్టించుకోరని అన్నారు. గతంలో రేవంత్ రెడ్డిని తిట్టిన మాటలు అందరికీ గుర్తే ఉన్నాయన్నారు. నాకు గోవాలో హోటల్ ఉందన్న మల్లారెడ్డి.. రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానని చెప్పారు. మనిషి జీవితం ఒకేసారి వస్తుందన్న మల్లారెడ్డి.. ఎంజాయ్ చెయ్యాలని కామెంట్ చేశారు.
Also Read : ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టులో పిటిషన్.. రేవంత్‌కు నోటీసులు
”నాకు ఇవే చివరి ఎన్నికలు. బీఆర్ఎస్ నుండి మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం టికెట్ నా కుమారుడు భద్రారెడ్డికి కన్ఫర్మ్ అయింది. పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. అందుకే నిన్న సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కలిశారు. బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకముందే, పట్నం మహేందర్ రెడ్డి వెళ్లి కర్చీఫ్ వేసి కూర్చున్నారు” అని మాజీమంత్రి మల్లారెడ్డి అన్నారు.
Also Read : రేవంత్ సర్కార్ బిగిస్తున్న ఉచ్చుతో.. బీహార్ ఐఏఎస్‌లలో టెన్షన్