ఏపీ రాజధాని విశాఖ : మాజీ సీఎస్ IYR

ఏపీ రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రానికి 3 రాజధానులు రావొచ్చేమో అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఆ తర్వాత కేపిటల్ అంశంపై రోజుకో

  • Publish Date - December 20, 2019 / 10:18 AM IST

ఏపీ రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రానికి 3 రాజధానులు రావొచ్చేమో అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఆ తర్వాత కేపిటల్ అంశంపై రోజుకో

ఏపీ రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రానికి 3 రాజధానులు రావొచ్చేమో అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఆ తర్వాత కేపిటల్ అంశంపై రోజుకో ప్రకటన వస్తోంది. ఎవరికి వారు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు.. ఏపీ కేపిటల్ పై ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖనే పూర్తిస్థాయి రాజధాని అవుతుందని ఆయన చెప్పారు. హైకోర్టు కర్నూలులో ఉంటుందన్నారు. రాజధాని విషయంలో సీఎం జగన్ ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని ఐవైఆర్ అన్నారు. శాసనసభ రాజధానిగా అమరావతి అనే తాయిలం చూపి పరిపాలనా రాజధానిని విశాఖకు మార్చడం, ఆపై అమరావతిలో అసెంబ్లీ సమావేశాలను కుదించడం లాంటివి క్రమంగా జరుగుతాయని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.

పూర్తి స్థాయి రాజధాని విశాఖ అంటూ ఐవైఆర్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. అంతా దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఐవైఆర్ మాజీ సీఎస్, రిటైర్డ్ ఐఏఎస్ కావడంతో.. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇది ఇలా ఉంటే.. రాజధాని అమరావతిలో రైతులు రోడ్డెక్కారు. మూడు వద్దు ఒకటే ముద్దు అంటున్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపారు. సీఎం జగన్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో రాజధానిగా అమరావతి ఏర్పాటుకు.. సీఎం జగన్ కూడా మద్దుతు తెలిపారని… ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

మూడు రాజధానుల అంశాన్ని స్వాగతించే వాళ్లూ లేకపోలేదు. అభివృద్ధితో పాటు పరిపాలన వికేంద్రీకరణ కూడా జరిగి తీరాల్సిందే అంటున్నారు. ఇది మంచి నిర్ణయం అన్ని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయని అభిప్రాయపడ్డారు.