సంక్రాంతి లోపు పసుపుకి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, పసుపు రైతుల కోసం ప్రతి సంవత్సరం రూ. 100 నుంచి రూ. 200 కోట్ల నిధులు ఇవ్వనున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించారు. ఈ రైతులకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. సమన్వయం లోపం వల్ల బోర్డులు సరిగ్గా పనిచేయడం లేదని, బోర్డులో ఉండే అధికారాలతో పాటు..కేంద్రం సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనుందని తెలిపారు. 2019, డిసెంబర్ 15వ తేదీ
మద్దతు ధర కోసం కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. ఎన్నో రోజులుగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని అక్కడి రైతులు కోరుతున్న సంగతి తెలిసిందే. రోడ్లెక్కారు. ఆందోళనలు చేశారు. ఎన్నో వినతిపత్రాలు ఇచ్చారు. కానీ వారి సమస్య పూర్తి కాలేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చి..మరిచిపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన బీజేపీ ఎంపీ అరవింద్ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని రైతులు కోరారు.
* డిసెంబర్ 14వ తేదీ శనివారం కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్‌లను ఎంపీ అరవింద్ కలిశారు.
* పసుపు దిగుమతి నిలిపేయాలని కేంద్రాన్ని కోరామని..ఇందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు.
* పసుపు పంటకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
* అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రావాలన్నారు అరవింద్.
* ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం పసుపు మద్దతు ధరపై ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్నారు.
తాజాగా ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై పసుపు రైతులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
Read More : సీనియర్లు ర్యాగింగ్ : మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం