Cm Chandrababu: ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం..! గ్రౌండ్‌లోకి దిగిపోతున్న సీఎం చంద్రబాబు.. అసలు కూటమి ముందస్తు ప్లానేంటి?

అధికారంలో ఉన్న కూటమి ఇప్పుడే అలర్ట్‌ అవడం.. క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం చంద్రబాబు రెడీ అవుతుండటం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Cm Chandrababu: ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం..! గ్రౌండ్‌లోకి దిగిపోతున్న సీఎం చంద్రబాబు.. అసలు కూటమి ముందస్తు ప్లానేంటి?

Updated On : October 17, 2025 / 7:57 PM IST

Cm Chandrababu: ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల టైమ్ ఉంది. కానీ రేపో మాపో ఎలక్షన్ అన్నట్లుగా..సీఎం చంద్రబాబు అప్పుడే ప్రచారం స్టార్ట్ చేశారు. ఎక్కడికి వెళ్లినా మీ ఓటు మాకేనని అభ్యర్థిస్తున్నారు. ప్రతీ అంశంలో ప్లస్‌లు, మైనస్‌లు బేరీజు వేసుకుని మరీ ముందుకెళ్తున్నారు. కూటమిలో గ్యాప్‌ రాకుండా..ప్రజల్లో ప్రభుత్వంపై బ్యాండ్‌ నేమ్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే..ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అటు వైసీపీ కూడా కదనరంగంలోకి దిగేందుకు రెడీ అవుతోంది. కూటమి ముందస్తు ప్లానేంటి? వైసీపీ వ్యూహాలకు ఇంకా టైముందా?

రేపే నోటిఫికేషన్. పది రోజుల్లో ఎలక్షన్స్. ఈ ఎన్నికలు చాలా కీలకం అన్నట్లుగా ఉంది ఏపీ రాజకీయం. ఇష్యూ ఏదైనా..టాపిక్ మరేదైనా అధికార, విపక్షాలు ప్రతీదాన్ని అడ్వాంటేజ్‌గా మల్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పొలిటికల్ స్టెప్పులు ఆసక్తికరంగా మారాయి. కూటమిగా అధికారంలోకి వచ్చి 15 నెలలు అయిందో లేదో..అప్పుడే రాబోయే ఎన్నికల కసరత్తును స్పీడప్ చేశారు.

ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు 2029 మేలో జరుగుతాయి. అప్పటివరకు పాలన చూసుకుంటూ నెట్టుకురావొచ్చు. కానీ నాలుగోసారి సీఎంగా బాబు ప్రమాణం చేసిన మరుసటి రోజు నుంచే..రేపటి కోసం ఫ్యూచర్ ప్లాన్ నడుస్తూనే ఉంది. రేపే ఎన్నికలు ఉన్నాయా అన్నట్లుగా..కార్యక్రమాలు..కూటమి ప్రభుత్వ పాలన..సంక్షేమ పథకాలు..ఇలా అన్నీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎక్కడికెళ్లినా కూటమికి వెన్నుదన్నుగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు. మళ్లీ వైసీపీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఉదాహరణలతో మరీ చెబుతున్నారు. ఏ పథకం అయినా కార్యక్రమం అయినా జనం మధ్యనే చేస్తున్నారు.

నవంబర్ నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటన..

ఇక ఇప్పటికే సూపర్‌ సిక్స్.. సూపర్ సక్సెస్‌ అంటూ డోర్‌ టు డోర్ క్యాంపెయిన్ చేసింది కూటమి. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సీఎం చంద్రబాబే గ్రౌండ్‌లోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. నవంబర్ నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను అని బాబు ప్రకటించేశారు. ప్రజల దగ్గరికే వెళ్లి పథకాల అమలుపై ఆరా తీయాలని..అలా అయితే ఏవైనా లోటు పాట్లు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అప్పటి దాకా ప్రజల మధ్యనే ఉండేలా ప్రణాళిక రచిస్తున్నారట.

పబ్లిక్‌ పల్స్‌ను పట్టుకోవడంలో చంద్రబాబు మార్క్ వేరే. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. పైగా గ్రౌండ్‌ లెవల్‌లో ఏం జరుగుతుందో..జనం ఒపీనియన్‌ ఏంటో ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుని స్టడీ చేయడం బాబుకు ముందు నుంచి అలవాటుగా ఉందట. ఎప్పటికప్పుడు సర్వేలు కూడా చేయించుకుంటూనే ఉన్నారు. వీటన్నింటికీ మించి ఫస్ట్ రిపోర్టులాగా..క్షేత్రస్థాయిలో పర్యటిస్తే..జనాల ఒపీనియన్‌ తెలుసుకోవచ్చని అనుకుంటున్నారట. ఇక 2029 ఎన్నికల్లో కూడా మొన్నటి లాగే..అద్భుతమైన విజయం సాధించాలంటే ఏమి చేయాలనేదానిపై గ్రౌండ్‌ ప్రిపేర్ చేస్తున్నారు. విపక్షం ఇంకా ఫీల్డ్‌లోకి దిగకముందే ఓ అడుగు ముందుకేసి పబ్లిక్‌కు దగ్గర కావొచ్చని ప్లాన్ వేస్తున్నారట చంద్రబాబు.

ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు రెండు పెద్ద ఇష్యూస్..

అటు వైసీపీ కూడా ఇన్‌ హౌజ్‌ మీటింగ్‌లో బిజీగా ఉంది. ఘోర పరాజయం..నేతల జంపింగ్‌లు..లీడర్ల అరెస్టులు..ఆ తర్వాత లిక్కర్ స్కామ్‌ కేసు..ఇలా వరుస ఇష్యూలతో స్ట్రగుల్స్‌ ఫేస్‌ చేసిన వైసీపీకి..ఈ మధ్యే ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు రెండు పెద్ద ఇష్యూస్ తగిలాయి. నకిలీ మద్యం వ్యవహారం.. మెడికిల్ కాలేజీల పీపీపీ విధానంపై..స్ట్రాంగ్ వాయిస్ వినిపించి..ప్రొటెస్ట్‌లు, విమర్శలు..అలిగేషన్స్‌తో..కూటమి సర్కార్‌పై కాస్త గట్టిగానే వాయిస్‌ రేజ్‌ చేసి జనం దృష్టిని ఆకట్టుకోలిగింది.

ఇలా ఎప్పటికప్పుడు ఇష్యూ బేస్డ్‌గా జనంలోకి వెళ్తూ..ఎన్నికల వ్యూహ రచనలో కూడా జగన్‌ బిజీగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మిర్చి, మామిడి రైతుల పక్షాన జగన్ పర్యటనలు చేసి చర్చకు తెరలేపారు. లేటెస్ట్‌గా మెడికల్ కాలేజీ అంశాన్ని వైసీపీ చాలా బలంగా జనాల్లోకి తీసుకెళ్లింది. వైసీపీ నేతల మెడికల్ కాలేజీల టూర్లతో పాటు..మాజీ సీఎం జగన్ నర్సీపట్నంలో పర్యటించిన మెడికల్ కాలేజీ పీపీపీ విధానంపై కూటమి సర్కార్‌ తీరును తప్పుబట్టారు.

ఇక జిల్లాల పర్యటన చేస్తానని గతంలోనే ప్రకటించిన ఫ్యాన్ పార్టీ అధినేత..ముందుగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ లీడర్, క్యాడర్‌కు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు కూడా జగన్ ప్లాన్‌ చేస్తున్నారని అంటున్నారు. అది ఎప్పుడు ఉంటుందో ఇప్పటికి క్లారిటీ లేదు. అయితే జిల్లాల టూర్‌ లేక పాదయాత్రకు సంబంధించి త్వరలో షెడ్యూల్‌ ఇచ్చి వైసీపీ కూడా ప్రజాక్షేత్రంలోకి దిగబోతోందట.

అయితే ఫ్యాన్ పార్టీ ఇప్పటి నుంచే పబ్లిక్‌లోకి వెళ్లడమనేది అపోజిషన్‌ పార్టీగా వాళ్లకు తప్పదు. కానీ అధికారంలో ఉన్న కూటమి ఇప్పుడే అలర్ట్‌ అవడం.. క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం చంద్రబాబు రెడీ అవుతుండటం ఇంట్రెస్టింగ్‌గా మారింది. మొత్తానికి ప్రభుత్వం మారి రెండేళ్లు కాకముందే ఏపీలో రాజకీయం రంజుగా మారేలా కనిపిస్తోంది.

Also Read: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌ చుట్టూ రాజకీయం..! ఎందుకీ వివాదం? వైసీపీ వాదన ఏంటి?