Clashes In Alur YCP
Alur YCP : ఆలూరు వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. వర్గపోరు ఏ రేంజ్ కు వెళ్లిందంటే.. ఒకే రోడ్డుకు ఇద్దరు భూమి పూజ చేశారు. ఏకంగా మంత్రిని కాదని భూమిపూజ చేశారు విరుపాక్షి. అదే రోడ్డుకు భూమి పూజ చేశారు మంత్రి గుమ్మనూరు జయరాం. హోలగుంద మండలం మారుమడి రోడ్డుకు ఇద్దరు భూమి పూజ చేశారు. కార్మిక శాఖ మంత్రి జయరాం, ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ విరుపాక్షి మధ్య వర్గ పోరు నడుస్తోంది. ఒకే రోడ్డుకు ఇద్దరు భూమి పూజ చేయడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది.
Also Read : మరో ఛాన్స్ లేనట్లేనా? ఆ ఇద్దరు మహిళా ఎంపీల రాజకీయ భవిష్యత్‌పై సందేహాలు
మంత్రి జయరాం కన్నా ముందే విరుపాక్షి భూమి పూజ చేశారు. ప్రభుత్వ ప్రారంభ కార్యక్రమంలో నువ్వా నేనా అన్న చందంగా ఇరువురూ పోటీపడ్డారు. వీరి తీరుతో అటు అధికారులు, ఇటు వైసీపీ నాయకులు అయోమయానికి గురయ్యారు. ఎవరి వెంట వెళ్లాలో తెలియక అధికారులు, వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. హోలగుంద మండలం మారుమడి రహదారి కి భూమి ఆలూరు నియోజవర్గ వైసీపీ ఇంచార్జ్ విరుపాక్షి భూమి పూజ చేశారు. ఇదే మారుమడికి రహదారికి మంత్రి సైతం భూమి పూజ చేయడం పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి జయరాం భూమి పూజ సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
Also Read : ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక పక్కా ప్లాన్?