ఆర్టీసీ సమ్మె కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి వీరు సమ్మెలో ఉంటున్నారు. సమ్మె..5 వేల 100 బస్సు రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. 2019, నవంబర్ 18వ తేదీ సోమవారం నాడు జరిగే విచారణపై సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. కార్మికులు తమ వాదన వినిపించనున్నారు. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో దాఖలు చేసిన ఫైనల్ అఫిడవిట్ పిటిషన్.. కార్మిక వర్గాల్లో మరింత ఆగ్రహం తెప్పించింది.
తాత్కాలికంగా విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టినా.. కార్మికులు ఏ క్షణాన్నైనా మళ్లీ విలీనం కోసం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉందని అఫిడవిట్‌లో తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు విపక్షాలతో కలిసి కుట్రపూరితంగా జేఏసీ నేతలు సమ్మెకు వెళ్లారని.. కాబట్టి చర్చలు జరపడం కుదరదని అఫిడవిట్‌లో తెలపడంతో ఆందోళనలు ఉధృతం చేశారు. ప్రభుత్వం దిగి వచ్చి తమతో చర్చలు జరిపేంత వరకు.. సమ్మెను కొనసాగించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. అప్పటివరకు తమ ఆందోళనలు ఉద్ధృతం చేస్తూనే ఉంటామని తెలిపారు.
మరోవైపు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. కార్మికులు తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తున్నారు. నిరాహార దీక్ష చేస్తున్న జేఏసీ నాయకుల అరెస్టులతో.. కార్మికుల్లో ఆగ్రహం మరింత రెట్టింపైంది. నిరాహారదీక్ష చేస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు చేశారు. ఆరోగ్యం క్షీణిస్తుండటంతో దీక్ష విరమించుకోవాలని వైద్యులు సూచించారు. అందుకు.. అశ్వత్థామరెడ్డి నిరాకరించడంతో పోలీసులు బలవంతంగా దీక్షను భగ్నం చేసి.. అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి తలుపులు పగలగొట్టి ఆయన దీక్షను భగ్నం చేసి.. బయటకు తీసుకొచ్చారు. మొత్తంగా సమ్మె, తదితర అంశాలపై హైకోర్టు తీర్పును వెలువరిస్తుందా ? లేక మళ్లా వాయిదా వేస్తుందా అనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది.
Read More : నాపై కుట్ర జరిగింది : మంత్రి గంగుల కమలాకర్