Himachal Cabinet Delayed Due To.. Himachal Pradesh CM Sukhu
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం చేసి మూడు రోజులైంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరగలేదు. కనీసం ఈ సమయంలో ఉంటుందని, వీరు వీరు కేబినెట్లో ఉండనున్నారనే అధికారిక ప్రకటన అటు ప్రభుత్వం నుంచి కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ రాలేదు. ఈ విషయమై ముఖ్యమంత్రి సుఖు అనేక ప్రశ్నల్ని ఎదుర్కొంటున్నారు. తాజాగా మీడియా ఆయనను ఈ విషయమై మరోమారు ప్రశ్నించింది. కచ్చితమైన సమాధానం చెప్పలేదు. కానీ, కొంత వరకు అయితే సమాధానం చెప్పుకొచ్చారు.
కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఒత్తిడి ఉందని, రాష్ట్రంలో పార్టీ వర్గాలుగా విడిపోవడం వల్ల కూర్పు కష్టతరమవుతోందని, బీజేపీ ఆపరేషన్ లోటస్ చేపట్టిందంటూ వస్తున్న వార్తలను సీఎం సుఖు ఖండించారు. ఇవన్నీ అవాస్తవమని అన్నారు. ‘‘నా మీద ఎవరి బలవంతం లేదు, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఎప్పటికీ అలాగే ఉంటాను. ఇక పార్టీలో అనైతక్యత, బీజేపీ ఆపరేషన్ లోటస్ అనేవి మీడియా సృష్టించినవి. పార్టీలో అందరం కలిసే ఉన్నాం. మా నేతల్ని లాగేంత ధైర్యం బీజేపీ చేయదు’’ అని సుఖు అన్నారు.
Public Smoking: పొగ రాయుళ్లకు షాక్ ఇస్తున్న అధికారులు.. తెలంగాణలో ఈ ఏడాది 28 వేల మందికి జరిమానా
తొలుత హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, అటు పిమ్మట కేబినెట్ కూర్చు చేపట్టనున్నట్లు ఆయన హింట్స్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడికి మంత్రి పదవిపై ఆయన స్పందిస్తూ ‘‘అతడు యువకుడు. కచ్చితంగా అతడి గురించి ఆలోచిస్తాం. కానీ అది అసెంబ్లీ సమావేశాల అనంతరం’’ అని చెప్పుకొచ్చారు. సుఖు మాటల్ని చూస్తుంటే కేబినెట్ విస్తరణే అసెంబ్లీ సమావేశాల అనంతరం జరిగేట్టు ఉంది.
కొద్ది రోజుల క్రితం జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలు గెలుచుకుంది. ఇక బీజేపీ 25 స్థానాల్నే గెలచుకుని అధికారాన్ని కోల్పోయింది.
Insurance Money: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చనిపోయినట్లు నాటకం.. నిజంగానే చంపిన స్నేహితులు!