Insurance Money: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చనిపోయినట్లు నాటకం.. నిజంగానే చంపిన స్నేహితులు!

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తాను చనిపోయినట్లు నాటకం ఆడాలనుకున్నాడో వ్యక్తి. తను చనిపోయినట్లు నమ్మించాలని స్నేహితులకు చెప్పాడు. కానీ, డబ్బుల కోసం నిజంగానే చంపేశారు ఆ స్నేహితులు.

Insurance Money: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చనిపోయినట్లు నాటకం.. నిజంగానే చంపిన స్నేహితులు!

Insurance Money: డబ్బు ఎవరితో ఎలాంటి పనైనా చేయిస్తుంది అనేందుకు నిదర్శనం ఈ ఘటన. ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చనిపోయినట్లు నాటకం ఆడాలనుకున్నాడు. దీనికోసం స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు. కానీ, అదే స్నేహితుల చేతిలో నిజంగానే హతమయ్యాడు. గత ఏడాది మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Tamil Nadu: ట్రక్కు తాడు మెడకు చుట్టుకుని రోడ్డుపై ఎగిరి పడ్డ బైకర్.. అనూహ్య ఘటన

నాసిక్ ప్రాంతానికి చెందిన అశోక్ భాలేరావ్ అనే వ్యక్తి తన్న స్నేహితులతో కలిసి డబ్బు కోసం 2018లో ఒక పథకం రచించాడు. తన పేరు మీద రూ.4 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకుంటానని, తర్వాత కొంతకాలానికి తాను చనిపోయినట్లు నాటకం ఆడతానని స్నేహితులకు చెప్పాడు. తాను చనిపోయినట్లు అందరినీ నమ్మించి, ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేలా చేయాలని, తర్వాత అందరూ కలిసి డబ్బులు పంచుకుందామని చెప్పాడు. తను మరణించినట్లు నమ్మించేందుకు ఎవరో ఒక వ్యక్తిని యాక్సిడెంట్‌లో చంపేసి, ఆ మృతదేహాన్ని తనదిగా నమ్మించాలని సూచించాడు. దీనికి అశోక్ స్నేహితుడు మంగేష్‌తోపాటు మరికొందరు కూడా అంగీకారం తెలిపారు. అనుకున్నట్లుగానే అశోక్ రూ.4 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. అయితే, అశోక్ రూపొందించిన ప్లాన్ అమలు కాలేదు. మంగేష్‌తోపాటు మిగతా స్నేహితులంతా కలిసి తమ ప్లాన్ అమలు చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో అశోక్‌ను నిజంగానే చంపేశారు.

Mumbai: అదృష్టమంటే అతడిడే.. బస్సు కింద పడ్డా బతికిపోయాడు.. వైరల్ వీడియో

యాక్సిడెంట్ చేసి, ఒక పార్క్ దగ్గర పడేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వల్ల అశోక్ మరణించాడని అందరినీ నమ్మించారు. పోలీసులు కూడా ఇదే నిజమని నమ్మి కేసు క్లోజ్ చేశారు. అయితే, ఈ ఘటనపై కొంతకాలంగా అశోక్ సోదరుడికి అనుమానాలున్నాయి. దీంతో ఇటీవల ఈ కేసు రీఓపెన్ చేసి విచారించాలని పోలీసులను కోరాడు. ఇదే సమయంలో అశోక్ స్నేహితులు ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేసుకున్నారు. కేసు రీఓపెన్ చేసిన పోలీసులు విభిన్న కోణాల్లో విచారించడం మొదలుపెట్టారు. వారికి అశోక్ స్నేహితుల్లో ఇద్దరి అకౌంట్లలో ఇటీవల భారీగా డబ్బు జమ కావడం గుర్తించారు. వారిపై అనుమానం వచ్చి విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ స్నేహితుడిని డబ్బు కోసం తామే హత్య చేసినట్లు చెప్పారు. ఈ హత్యలో ఆరుగురు నిందితులుగా తేలింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు.