Jitan Ram Manjhi: నితీశ్ ఎక్కడుంటే అక్కడే.. జేడీయూ బహిష్కృత నేత, మాజీ సీఎం జితన్ రాం మాంఝీ

దీనికి ముందు రాష్ట్రంలోని పునియాలో చేపట్టిన బహిరంగ సభలో నితీశ్ మాట్లాడుతూ ‘‘మేమంతా కలిస్తే బీజేపీని 100 సీట్ల కిందకు తోసివేస్తాం’’ అని అన్నారు. అయితే రాష్ట్రంలో మహా కూటమి నుంచి జీతన్ రాం మాంఝీని తమవైపుకు లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని నితీశ్ అన్నారు. బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Jitan Ram Manjhi: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎక్కడుంటే తాను అక్కడే ఉంటానని, ఎట్టి పరిస్థితుల్లో ఆయనను వదిలేది లేదని చాలా కాలం క్రితమే నితీశ్ నేతృత్వంలోని జనతా దళ్ యూనియన్ నుంచి బహిష్కృతానికి గురైన నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ అన్నారు. మాంఝీని తమవైపుకు లాక్కోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తోందని నితీశ్ కుమార్ ఆరోపణలు చేసిన మర్నాడే మాంఝీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. బిహార్ ప్రభుత్వంలోని ప్రస్తుత ఆర్జేడీ-జీడీఎస్ కూటమిలో మాంఝీ కీలక భాగస్వామి.

DD and AIR: దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోకు న్యూస్ సప్లయర్‭గా ఆర్ఎస్ఎస్ మీడియా

‘‘నేను పేదవాడిని కావచ్చు. కానీ తిరిగి సాయం చేయడానికి పేద ప్రజలు దేన్నైనా త్యాగం చేస్తారు. నితీశ్ కుమార్ నన్ను ముఖ్యమంత్రిని చేశారు. నాకు గౌరవాన్ని ఇచ్చారు. నేనైనా, నా కుటుంబమైనా దీన్ని ఎప్పటికీ మర్చిపోం’’ అని అన్నారు. దీనికి ముందు రాష్ట్రంలోని పునియాలో చేపట్టిన బహిరంగ సభలో నితీశ్ మాట్లాడుతూ ‘‘మేమంతా కలిస్తే బీజేపీని 100 సీట్ల కిందకు తోసివేస్తాం’’ అని అన్నారు. అయితే రాష్ట్రంలో మహా కూటమి నుంచి జీతన్ రాం మాంఝీని తమవైపుకు లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని నితీశ్ అన్నారు. బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

PM Modi: 8 కోట్ల మంది రైతులకు రూ.16,000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ

ట్రెండింగ్ వార్తలు