DD and AIR: దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోకు న్యూస్ సప్లయర్‭గా ఆర్ఎస్ఎస్ మీడియా

హిందుస్థాన్ సమాచార్‭నను 1948లో శివరామ్ శంకర్ ఆప్టే అలియాస్ దాదాసాహెబ్ ఆప్టే స్థాపించారు. గుజరాత్‌లోని బరోడాలో జన్మించిన జర్నలిస్టు ఆప్టే, ఆర్ఎస్ఎస్‭తో జీవితా చరమాంకం వరకు అనుబంధం కలిగి ఉన్నారు. 1964లో విశ్వహిందూ పరిషత్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. 1956లో హిందుస్థాన్ సమాచార్ సహకార సంఘంగా నమోదు అయింది

DD and AIR: దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోకు న్యూస్ సప్లయర్‭గా ఆర్ఎస్ఎస్ మీడియా

RSS-linked newswire service that will provide content to Doordarshan and AIR

DD and AIR: దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో కోసం వార్తల్ని సరఫరా చేయడానికి ఆర్ఎస్ఎస్-లింక్డ్ వైర్ సర్వీస్ హిందుస్థాన్ సమాచార్‭తో రెండేళ్ల ఒప్పందంపై సంతకం చేసింది పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి. భారతీయ వార్తాపత్రికల లాభాపేక్షలేని సహకార సంస్థ అయిన ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి తన సభ్యత్వాన్ని 2020లో రద్దు చేసింది. ఇక తాజాగా హిందుస్థాన్ సమాచార్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

Medico Preethi : ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? సమగ్ర విచారణ జరిపించాలని హెచ్ఆర్సీకి ఫిర్యాదు

హిందుస్థాన్ సమాచార్‭నను 1948లో శివరామ్ శంకర్ ఆప్టే అలియాస్ దాదాసాహెబ్ ఆప్టే స్థాపించారు. గుజరాత్‌లోని బరోడాలో జన్మించిన జర్నలిస్టు ఆప్టే, ఆర్ఎస్ఎస్‭తో జీవితా చరమాంకం వరకు అనుబంధం కలిగి ఉన్నారు. 1964లో విశ్వహిందూ పరిషత్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. 1956లో హిందుస్థాన్ సమాచార్ సహకార సంఘంగా నమోదు అయింది. 1975లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన వెంటనే, ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆ కాలపు నాలుగు వార్తా సంస్థలైన పీటీఐ, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యూఎన్ఐ), హిందుస్థాన్ సమాచార్, సమాచార్ భారతిలను ఒకే సమాచార్ కింద విలీనం చేసింది.

New Secretariat: కొత్త సచివాలయం ఉస్మానియా ఆసుత్రికి ఇచ్చేయాలట.. సీఎంకు డాక్టర్స్ అసోసియేషన్ లేఖ

అయితే ఇందిరా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని 1977 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం తిరగేసింది. అయితే 1983లో ఇందిరా ప్రభుత్వం మళ్లీ హిందుస్థాన్ సమాచార్‭ని లక్ష్యంగా చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని హిందుస్థాన్ సమాచార్ సవాలు చేస్తూ 1999లో ఢిల్లీ హైకోర్టులో కేసును గెలుపొందింది. ఆ తర్వాత, సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకుడు శ్రీకాంత్ జోషి ఏజెన్సీని తిరిగి ప్రారంభించారు.

PM Modi: 8 కోట్ల మంది రైతులకు Rs.16,000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ

ఇక ప్రసార భారతితో హిందుస్థాన్ సమాచార్ ఒప్పందం కొత్తది కాదు. ఇది 2020 ఫిబ్రవరి నుంచే ప్రస్తార భారతితో హిందుస్థాన్ సమాచార్ కాంట్రాక్టులో ఉంది. అయితే తాజా ఒప్పందం వార్షిక కాంట్రాక్ట్ పునరుద్ధరణ మాత్రమేనని తెలుస్తోంది. “మేము హిందుస్థాన్ సమాచార్‌తో ముందస్తు ఒప్పందం చేసుకున్నాము. అది తాజాగా పునరుద్ధరించాం’’ అని ప్రసార భారతి సీఈవో గౌరవ్ ద్వివేది ఆదివారం అన్నారు.