Medico Preethi : ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? సమగ్ర విచారణ జరిపించాలని హెచ్ఆర్సీకి ఫిర్యాదు

మెడికో ప్రీతి మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ హెచ్ఆర్సీని ఆశ్రయించారు ఓయూ జేఏసీ నేతలు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ప్రీతిది హత్యా? లేక ఆత్మహత్యా? అనేది తేల్చాలని విజ్ఞప్తి చేశారు.

Medico Preethi : ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? సమగ్ర విచారణ జరిపించాలని హెచ్ఆర్సీకి ఫిర్యాదు

Medico Preethi : మెడికో ప్రీతి మృతి ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రీతి మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ హెచ్ఆర్సీని ఆశ్రయించారు ఓయూ జేఏసీ నేతలు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ప్రీతిది హత్యా? లేక ఆత్మహత్యా? అనేది తేల్చాలని విజ్ఞప్తి చేశారు. గాంధీ ఆసుపత్రిలో ప్రీతి పోస్టుమార్టంని సీనియర్ అధికారులతో నిర్వహించలేదని ఫిర్యాదు చేశారు ఓయూ జేఏసీ నేతలు. దీనిపై రేపు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.

పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతిది ఆత్మహత్యా? లేక హత్యా? ఇదొక అంతుచిక్కని మిస్టరీగా మారింది. వరంగల్ ఎంజీఎంలో సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్‌ వేధింపులే ప్రీతి చావుకు దారితీశాయన్నది ప్రధాన ఆరోపణ. ఒక సీనియర్‌గా తనకు సహకరించాల్సింది పోయి వేధించినట్టు ఆమె చివరి మాటల ద్వారా తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులు మాత్రం.. సైఫే తమ కూతురిని పొట్టన బెట్టుకున్నాడని ఆరోపిస్తున్నారు. ప్రీతిది ఆత్మహత్య కాదు హత్య అంటున్నారు.(Medico Preethi)

Also Read..Medico Preeti : ప్రీతిది ముమ్మాటికీ మర్డరే.. తండ్రి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు

సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి.. హైదరాబాద్‌ నిమ్స్‌లో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడింది. వెంటిలేటర్, ఎక్మో‌పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆదివారం రాత్రి 9.16 గంటలకు ప్రీతి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఈ నెల 22న హానికారక ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా ఆత్మహత్యకు యత్నించింది. తొలుత ఆమెకు వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ఆమెను బతికించేందుకు ప్రత్యేక వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. అయినా, ఫలితం లేకపోయింది.

Also Read..Harassment Student Died : మెడికో ప్రీతి ఘటన మరువకముందే మరో దారుణం.. సీనియర్ వేధింపులకు విద్యార్థిని బలి

తమ కూతురు ప్రాణాలతో తిరిగి వస్తుందని ఆశించిన తల్లిదండ్రులు.. ఆమె మ‌ృతితో గుండె పగిలేలా విలపించారు. తమ కూతురు పెద్ద ఆశయంతో ఉండేదని, ఆమెతో పాటు ఆ ఆశయం కూడా చనిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె తండ్రి నరేందర్‌ ఆరోపించారు. ప్రీతికి ఎవరో ఇంజక్షన్‌ ఇచ్చారని, ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రీతి మృతి చెందడానికి గల కారణాలు తెలపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.