Bhuma Akhila Priya (Photo : Twitter)
Bhuma Akhila Priya – AV Subba Reddy : టీడీపీ అధికారంలోకి వస్తే హోం మంత్రి పదవిని మహిళకే ఇవ్వాలని మాజీమంత్రి భూమా అఖిలప్రియ కోరారు. నంద్యాల జిల్లాలో ఆమె మాట్లాడారు. ఆళ్ళగడ్డ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానని, సదా రుణపడి ఉంటానని ఆమె చెప్పారు. నాన్ బెయిల్ సెక్షన్లపై ఇద్దరం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నప్పుడు తనను మాత్రమే అరెస్ట్ చేశారని, ఇది న్యాయమేనా అని ఆమె ప్రశ్నించారు. ఘటన జరిగిన చోట నా భర్త లేడు. కానీ నా భర్త మీద కూడా కేసు పెట్టారు అని మండిపడ్డారు. ఆళ్లగడ్డలోనే కాదు నంద్యాలలో కూడా ఇంటింటికీ తిరుగుతాను అని భూమా అఖిలప్రియ చెప్పారు.
Also Read..TDP Leader Hariprasad : కొడాలి నానీ..కాపుల గురించి నోటికొచ్చినట్లు వాగితే నాలుక కోస్తాం
ఒక అమ్మాయి విషయంలో అన్యాయం జరిగితే తెలంగాణ పోలీసులు నిందితులను కాల్చి చంపితే శభాష్ అని మనమే అన్నాము అని ఆమె గుర్తు చేశారు. ప్రజల నుంచి తనను దూరం చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. నేను కేసులకు భయపడను అన్న అఖిలప్రియ.. నన్ను ఆపాలని చూస్తే నన్ను చంపడం తప్ప మరేమీ చెయ్యలేరు అని అన్నారు. రెడ్లే నన్ను కేసులో ఇరికించారు అని ఆమె ఆరోపించారు.(Bhuma Akhila Priya)
” టీడీపీ అధికారంలోకి వస్తే హోమ్ మినిస్టర్ మహిళలకు ఇవ్వండి. ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే భయపడాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు పెట్టినా, నన్ను తీహార్ జైల్లో వేసినా జైలు నుంచి నామినేషన్ వేసి గెలుస్తా. మీరు ఎన్ని కుట్రలు చేసినా నేను పార్టీకి ఇంకా దగ్గర అవుతున్నా. ప్రజలు మిమ్మల్ని స్వాగతించడం పక్కన పెడితే.. మహిళలు కొడతారు.
నన్ను ఇబ్బంది పెట్టిన ఒకరి మీదనే నేను కేసు పెట్టా. నువ్వు నాతో పాటు 10 మందిపై కేసు పెట్టావు. పోలీసు అధికారులకు ఏవీ సుబ్బారెడ్డి మీద ఎందుకంత ప్రేమ? డిపార్ట్ మెంట్ వాళ్లు డబ్బు తీసుకున్నారా? లేక వైసీపీకి లొంగి పని చేస్తున్నారా? ఏవీ సుబ్బారెడ్డి అసలు పార్టీలో ఉన్నారా? ఏవీ పార్టీలో ఉంటే పార్టీ కోసం నాలుగు సంవత్సరాలు ఏం చేశాడు? ఎవరైతే గుంటనక్కలు ఉన్నారో వాళ్ళ గురించి నారా లోకేశ్ చూసుకుంటారు” అని భూమా అఖిలప్రియ అన్నారు.(Bhuma Akhila Priya)
టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో ఇటీవల భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యి జైలుకెళ్లారు. ఆ తర్వాత ఆమె బెయిల్ పై బయటకు వచ్చారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన సమయంలో.. లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు అటు అఖిలప్రియ, ఇటు ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు కొత్తపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
Also Read..Chandrababu : వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు సెటైర్లు
కాగా, కొంత కాలంగా అఖిలప్రియ, సుబ్బారెడ్డి వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తపల్లి వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత ముదిరింది. అఖిలప్రియ మద్దతుదారుడు సుబ్బారెడ్డిపై దాడి చేయడంతో ఆయన ముక్కు నుంచి రక్తం కారింది. ఇది ఉద్రిక్తతకు దారితీసింది. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులోనే అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. నారా లోకేశ్ సమక్షంలోనే టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. అప్పట్లో దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు.