Seetharam Thammineni : బ్లాక్ కమాండోస్ లేకపోతే.. చంద్రబాబు ఫినిష్- స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

Seetharam Thammineni : ఎవడిని ఉద్దరించడానికి చంద్రబాబుకి బ్లాక్ కమాండోస్ ను ఇచ్చారు. వాళ్లు ఉన్నారనే ధైర్యంతో మాట్లాడుతున్నాడు.

Seetharam Thammineni

Seetharam Thammineni – Chandrababu : ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరిని ఉద్దరించడానికి చంద్రబాబుకు బ్లాక్ కమాండోస్ ను ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు బ్లాక్ కమాండోస్ ను తొలగించాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా కేంద్రానికి సిఫార్సు చేస్తానన్నారు. బ్లాక్ కమాండోస్ లేకపోతే చంద్రబాబు ఫినిష్ అన్నారు తమ్మినేని సీతారాం. ఎంతోమందికి బెదిరింపులు ఉన్నాయని, అందరికీ బ్లాక్ కమాండోస్ ను ఇస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవస్థలకు అతీతుడా? అని ప్రశ్నించారు తమ్మినేని సీతారాం.

Also Read..Bonda uma : టీడీపీ మ్యానిఫెస్టోతో వైసీపీ పునాదులు కదులుతున్నాయి.. అందుకే భయపడుతున్నారు : బోండా ఉమ

”బ్లాక్ కమాండోస్ ను తీసేయమని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఫినిష్. వాళ్లు ఉన్నారనే ధైర్యంతో మాట్లాడుతున్నాడు. ఎవడిని ఉద్దరించడానికి చంద్రబాబుకి బ్లాక్ కమాండోస్ ను ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా నేను సెంట్రల్ గవర్న్ మెంట్ కి అప్పీల్ చేస్తున్నా. బ్లాక్ కమాండోస్ ప్రొటెక్షన్ పొందడానికి ఎవరూ అర్హులు కారు. జెడ్ ప్లస్ కేటగిరికి ఎలా ఎల్జిబుల్ అయ్యాడు. దేశంలో చాలామందికి వార్నింగ్ లు ఉన్నాయి. చాలామంది ప్రాణాలకు ప్రమాదం ఉంది. మరి వారందరికీ బ్లాక్ కమాండోస్ ఇస్తారా? అధికారం లేకపోతే చంద్రబాబు విలవిల కొట్టుకుంటాడు” అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు స్పీకర్ తమ్మినేని.