Bonda uma : టీడీపీ మ్యానిఫెస్టోతో వైసీపీ పునాదులు కదులుతున్నాయి.. అందుకే భయపడుతున్నారు : బోండా ఉమ

ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని ముందు ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం ఆ తరవాత మాటతప్పిందని..మోసం చేసిందని విమర్శించారు. మొదట్లో వృద్ధులకు రూ.200లు ఉన్న పెన్షన్ ను రూ.2000లు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు.

Bonda uma : టీడీపీ మ్యానిఫెస్టోతో వైసీపీ పునాదులు కదులుతున్నాయి.. అందుకే భయపడుతున్నారు : బోండా ఉమ

bonda uma Kodali Nani

Bonda Umamaheswara Rao : మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు 2014 అసెంబ్లీ ఎన్నికలకు మిని మ్యానిఫెస్టోను ప్రకటించారు. దీనిపై వైసీపీ నేతలు ఘాటు విమర్శలు సంధిస్తున్నారు. చంద్రబాబు (Chandrababu) నకిలీ మ్యానిఫెస్టో అంటూ ఎద్దేవా చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి కాపీకొట్టారంటూ సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ నేతల విమర్శలపై టీడీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. దీంట్లో బాగంగా టీడీపీ నేత బోండా ఉమ మాట్లాడుతు.. టీడీపీ మ్యానిఫెస్టో (TDP Manifesto) తో వైసీపీ నేతలు భయపడుతున్నారని.. పార్టీ పునాదులు కదులుతున్నాయి అంటూ ఎద్దేవా చేశారు.

టీడీపీ పాలనలో అసలు సంక్షేమమే లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని కానీ మా పాలనలో చేసిన సంక్షేమంపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మీరున్నారా? అంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు బోండా ఉమ. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని ముందు ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం ఆ తరవాత మాటతప్పిందని..మోసం చేసిందని విమర్శించారు. మొదట్లో వృద్ధులకు రూ.200లు ఉన్న పెన్షన్ ను రూ.2000లు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని ఈ విషయం వైసీపీ గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

మహానాడులో చంద్రబాబు తొలిమానిఫెస్టో ప్రకటించగానే తాడేపల్లిలో భూకంపం వచ్చిందని.. మ్యానిఫెస్టో దెబ్బకు తాడేపల్లి పునాదులు కదిలిపోతున్నాయని అందుకే వైసీపీ నేతలు నోటికొచ్చినట్లుగా వ్యాఖ్యలుచేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను అక్షరాలా అమలు చేసి తీరుతామని.. రాష్ట్రంలో మహిళలు చంద్రబాబే సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారని మహిళలు ఆశీర్వాదంతో అది జరిగి తీరుతుందని అన్నారు.

Also Read: డర్టీ బాబు టిష్యూ మేనిఫెస్టోని ప్రకటించారు.. చించి చెత్తబుట్టలో వేయండి

చంద్రబాబు చేసిన సంక్షేమం, జగన్ చేసిన మోసం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. టీడీపీ చేసిన సంక్షేమంపై ఎవరితోనైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ బోండా ఉమ సవాల్ చేశారు. టీడీపీ చేసిన సంక్షేమంపై కొడాలి నానితో చర్చించేందుకు గుడివాడైనా తాడేపల్లి ప్యాలెస్ కైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం.. లేదంటే ఇంకెక్కడికి రమ్మన్నా వస్తామని కొడాలి నాని చర్చకు ఒక ఫోన్ కాల్ చేస్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ఛాలెంజ్‌ చేశారు టీడీపీ నేత బోండా ఉమ.