Nitish Kumar: ఇండియాకు చెక్ పెడుతున్న నితీశ్ పార్టీ..! కాంగ్రెస్, బీజేపీ లేకుండా ఫ్రంట్ కు వెళ్తారా?

ఇదే సమయంలో ఎన్డీయే, ఇండియా కాకుండా మూడో కూటమి పేరు కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం భారీ ప్రకటనే చేశారు. మాయావతి, కేసీఆర్ లాంటి నేతలతో కలిసి మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయొచ్చని అంటున్నారు

Third Front: విపక్షాల్ని ఏకం చేసి ఇండియా కూటమి ఏర్పడడంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాత్ర చాలా ముఖ్యమైంది. అయితే అదే నితీశ్.. కూటమిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాస్తవానికి తనకు ప్రధానమంత్రి అభ్యర్థిత్వం వస్తుందని ఆశించినప్పటికీ అది వాస్తవంలో లేదు. ఇక కనీసం కూటమి కన్వీనర్ అయినా దక్కుతుందనుకుంటే మూడు సమావేశాలు ముగిసినా స్పష్టత రాలేదు. పైగా ఇప్పుడు కూటమి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో ఇండియా కూటమిలో నితీశ్ తన ఆశలన్నీ వదులుకోవాల్సి వచ్చింది.

అయితే ఆయన మాత్రం ఇండియా కూటమికి చెక్ పెట్టనున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజులుగా ఆయన పార్టీ (జనతాదళ్ సెక్యూలర్) వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే విషయం స్పష్టమవుతోంది. నితీశ్ కుమార్ కాబోయే ప్రధాని, ప్రధాని అభ్యర్థి అంటూ ఆ పార్టీ నేతలు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. వాస్తవానికి కూటమి ఒప్పందం ప్రకారం.. అభ్యర్థి నిర్ణయించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. అయినప్పటికీ జేడీయూ నేతలు మాత్రం వాటిని బ్రేక్ చేసి వరుస ప్రకటనలు చేస్తున్నారు. వీటన్నిటీనీ చూస్తుంటే.. ఇండియా కూటమికి చెక్ పెట్టనున్నట్లు స్పష్టమవుతోంది.

Congress vs BJP: 2024లో బీజేపీని నిలువరించేందుకు సోషల్ జస్టిస్ జెండా ఎత్తుకున్న కాంగ్రెస్

జేడీయూ జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్, ఆ తర్వాత నితీశ్ మంత్రివర్గంలోకి వచ్చిన అశోక్ చౌదరిలు నితీశ్ కుమార్ ప్రధాని పదవికి అర్హులని అభివర్ణించారు. బీహార్‌ను పక్కన పెడితే, దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు సైతం నితీశ్ కుమార్‌ను ప్రధానిగా చూడాలనుకుంటున్నారని వారు అంటున్నారు. ఒక సర్వే చేస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అంటున్నారు. ఇక ఇదే సమయంలో ఆర్జేడీ కాస్త భిన్నంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో కాస్త సాన్నిహిత్యంగా ఉంటోంది. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీని ‘వరుడు’ అంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి.

Women Reservation Bill: 27 ఏళ్ల నిరీక్షణకు బ్రేక్ పడుతుందా? మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టం చేసేందుకు మోదీ ప్రభుత్వం బిగ్ ప్లాన్!

ఇక ఇదే సమయంలో ఎన్డీయే, ఇండియా కాకుండా మూడో కూటమి పేరు కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం భారీ ప్రకటనే చేశారు. మాయావతి, కేసీఆర్ లాంటి నేతలతో కలిసి మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయొచ్చని అంటున్నారు. ఎన్డీయే, ఇండియా కూటమిలో అనేక పార్టీలు చేరలేదని, వాటన్నిటితో కలిసి ఏర్పాటు చేయొచ్చని ఆయన వాదన. ఒకవేళ మూడో ఫ్రంట్ ఆలోచన ఎటునుంచి కార్యరూపం దాల్చినా అందులో నితీశ్ కుమార్ ఉండే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కారణం, నితీశ్ కుమార్ కు ఇండియా కూటమిలో తగిన ప్రాధాన్యం దక్కలేదు. అలాగే ఆర్జేడీ కూడా ఆయనను లెక్క చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో మూడో ప్రత్యామ్నాయమే నితీశ్ కు శరణ్యం అంటున్నారు.