‘రేవంత్ రెడ్డి పెద్ద తీస్ మార్ ఖానా ? ఏం పెద్ద హీరోనా ? పులియా ? అయితే..ఎందుకు ఓడిపోయిండు..? వెంటనే ఆయన అనుచరులు ఫేస్ బుక్‌లో జరుగుతున్న ప్రచారం వెంటనే ఆపేయాలి..లేకపోతే..ఢిల్లీకి వెళుతా..పెద్దలకు చెబుతా’..అంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ భూ దందా..అరెస్టుపై ఆయన అనుచరులు చేస్తున్న ప్రచారం, పార్టీకి ఏం సంబంధం అని సూటిగా ప్రశ్నించారు.
తనపై కూడా కేసులు బుక్ అయ్యాయని, పార్టీకి తాను రుద్దానా ? అన్నారు. ఫేస్ బుక్‌లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. పార్టీని పైకి తీసుకరావడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. జీవో 111పై అనవసర రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. ఈ జీవో ఎత్తివేయాలని తాము గతంలో పోరాటం చేయడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత..తాము పుట్టామన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలా ? రేవంత్ అనుచరులు పెడుతున్న దానిపై చర్చించాలా ? అని ప్రశ్నించారు.
ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఒక డైరెక్షన్ ఇవ్వాలని సూచించారు. ఏ ఇష్యూపైనా..పద్ధతి ప్రకారం జరగాలన్నారు. పీసీసీ పోస్టుకు..అరెస్టుకు సంబంధం ఏంటీ ? పార్టీని ఏం చేయాలని అనుకున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాక్కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారని, తాను చిటికె వేస్తే..ఎంత మంది వస్తారో చూస్తారా ? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంటే..రేవంత్ అనుచరులు చేస్తున్న ప్రచారం చాలా తప్పన్నారు. వెంటనే కోర్ కమిటీ మీటింగ్ పెట్టి..ఈ అంశాన్ని చర్చించాలన్నారు. ప్రచారం ఆపకపోతే..డైరెక్ట్‌గా ఢిల్లీకి వెళ్లి..సోనియా, రాహుల్ గాంధీకి వివరిస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు.
Read More : Breaking News : వరంగల్ NITలో కరోనా కలకలం