ప్రభుత్వం భవన నిర్మాణ కార్నికుల సమస్య పరిష్కరించేంత వరకు కార్మికులకు అండగా నిలబడి జనసైనికులు నిరసన తెలపాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్య కర్తలకు ఆదేశించారు. ప్రభుత్వం 2 వారాల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
చనిపోయిన వ్యక్తులకు 5లక్షలు ఎక్స్ గ్రేషియా ఇమ్మని ప్రభుత్వాన్ని కోరామని, నిర్మాణ రంగం కుదుట పడేంత వరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధినుంచి కార్మికులకు నెలకు 50 వేలు రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షాలు వరదలు ఏపీ లోనే లేవని కర్ణాటక, కేరళలో కూడా ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు.
ప్రభుత్వ విధి విధానాలను సవరించుకోవాలాని సూచించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఒక కమిటీ వేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయనటానికి నిదర్శనం సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేయటమే అని పవన్ కళ్యాణ్ విమర్శించారు.