భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన ఆహార శిబిరాలు ఏర్పాటు చేయబోతోంది. డొక్కా సీతమ్మ పేరిట నవంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనుంది. అడ్డాల్లో కార్మికులు చేరే చోటు శిబిరాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కళ్లు తెరిపించడమే తమ ఉద్దేశ్యమని, భవన నిర్మాణ కార్మికులకు భరోసా కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2019, నవంబర్ 08వ తేదీ శుక్రవారం హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో శిబిరాల ఏర్పాటుకు సంబంధించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు పవన్.
ఆకలితో ఉన్న వారికి పని కల్పించి కడుపు నింపాల్సిన గవర్నమెంట్..భవన నిర్మాణ కార్మికుల ఉపాధి పొగొట్టి వారి కడుపు మాడ్చేసిందన్నారు. విశాఖలో తాము నిర్వహించిన లాంగ్ మార్చ్ విజయవంతమైందని చెప్పుకొచ్చారు. పస్తులుంటున్న కార్మికుల కోసం చేతనైన సహాయం చేయాలని, జనసేన శ్రేణులు, నాయకులు, ఇతరులు కొంత కృషి చేసి ఆహార సదుపాయాన్ని ఏర్పాటు చేద్దామన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఐదు నెలలుగా వారు ఉపాధి కోల్పోయారని, ఇళ్లు కట్టుకొనే ప్రతొక్కరూ సెస్ కడుతారని తెలిపారు.
Read More : షార్ట్ ఫిలింస్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి వెళ్లే ఆ డబ్బును చనిపోయిన మిగిలిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారి కోసం ఆహార కేంద్రాలు పెట్టాలని, ఏ పేరు పెట్టుకున్నా..ఏ రంగు వేసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వం వారికి అండగా ఉండాలని, అలా చేయలేనిపక్షంలో ఇచ్చిన మాట మేరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం అన్నారు జనసేనానీ.
భవన నిర్మాణ కార్మికులకు అండగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు.https://t.co/2K1TFpt1XL
— JanaSena Party (@JanaSenaParty) November 8, 2019
భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు
Video Link: https://t.co/2K1TFpt1XL pic.twitter.com/7FmfnnIeTv
— JanaSena Party (@JanaSenaParty) November 8, 2019