JDS Devegowda: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని కొట్టడానికి భారతీయ జనతా పార్టీతో దోస్తీ చేస్తామని జనతాదళ్ సెక్యూలర్ చీఫ్ కుమారస్వామి నాలుగు శుక్రవారం ప్రకటించారు. ఒక రకంగా బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్సులో చేరబోతున్నట్లు ఖరారు చేశారు. దీనిపై రాజకీయ వర్గాల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. నాలుగు రోజుల్లో ఏం జరిగిందో కానీ, కుమారుడు కుమారస్వామి చేసిన ప్రకటనకు జేడీఎస్ చీఫ్ దేవెగౌడ పూర్తి విరుద్ధమైన ప్రకటన చేశారు. బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని, తాము స్వతంత్రంగానే ఉంటామని ఆయన ప్రకటించారు.
మంగళవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ‘‘చాలా ప్రశ్నలు వస్తున్నాయి. వాటన్నిటికీ నేను సరైన సమాధానం చెప్తున్నాను. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే సమస్యే లేదు. దాని గురించి ప్రశ్నలు ఇక అనవసరం. మేము ఒంటరిగానే మా పోరాటాన్ని కొనసాగిస్తాం’’ అని దేవెగౌడ అన్నారు. పొత్తు గురించి కుమారస్వామి పరోక్ష సంకేతాలు ఇచ్చిన నాలుగు రోజులకే అసలు పొత్తే ఉండదని దేవెగౌడ తేల్చి చెప్పడం గమనార్హం.
PM Modi : కన్నీరు పెట్టుకున్న ప్రధాని మోదీ.. అది I.N.D.I.A కూటమి కాదు ఈస్ట్ ఇండియా అంటూ ఆగ్రహం
కాగా, శుక్రవారం (జూలై 21) కుమారస్వామి స్పందిస్తూ “బీజేపీ, జేడీఎస్ రెండూ ప్రతిపక్ష పార్టీలు కావడంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని అసెంబ్లీ లోపలా, బయటా నేను ఇప్పటికే చెప్పాను. ఈరోజు ఉదయం కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో ఎలా ఉండాలనే దానిపై చర్చించారు” అని చెప్పారు. నేతలందరి అభిప్రాయాలను సేకరించి, అన్ని వర్గాల ప్రాతినిథ్యంతో 10 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి పార్టీ సంస్థకు వ్యతిరేకంగా గళం విప్పాలని శాసనసభా పక్ష సమావేశంలో దేవెగౌడ సూచించారట. మేలో కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో మొత్తం 224 మంది స్థానాలకు గాను కాంగ్రెస్ 135 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 66, జేడీఎస్ 19 స్థానాల్లో గెలుపొందాయి.