PM Modi : కన్నీరు పెట్టుకున్న ప్రధాని మోదీ.. అది I.N.D.I.A కూటమి కాదు ఈస్ట్ ఇండియా అంటూ ఆగ్రహం

ప్రధాని నరేంద్రమోదీ కన్నీరు పెట్టుకున్నారు. ప్రతిపక్షాలు పెట్టుకున్న కూటమి పేరులో ‘ఇండియా’ (I.N.D.I.A)టే సరిపోదు అంటూ విపక్షాలపై మోదీ సంచలన విమర్శలు చేశారు. I.N.D.I.A కూటమిని ఈస్ట్ ఇండియాతో పోల్చారు.

PM Modi : కన్నీరు పెట్టుకున్న ప్రధాని మోదీ.. అది I.N.D.I.A కూటమి కాదు ఈస్ట్ ఇండియా అంటూ ఆగ్రహం

PM Narendra Modi Cried

Updated On : July 25, 2023 / 1:53 PM IST

PM Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ కన్నీరు పెట్టుకున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాల రగడపై చర్చించేందుకు ఈ రోజు ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ సమావేశంలో మోదీ ప్రతిపక్షాల తీరువపై కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతిపక్షాల తీరుపై మోదీ తీవ్ర ఆవేదన చెందుతున్నారు అంటూ బీజేపీ వర్గాలు ప్రతిపక్షాల వైఖరిపై మండిపడుతున్నాయి. మణిపూర్ లో జరుగుతున్న మారణహోమంపై పార్లమెంట్ లో చర్చించేందుకు సిద్ధం అని ప్రకటించినా ప్రతిపక్షాల తీరుమాత్రం ఏమాత్రం సరిగా లేదని.. నానా రగడ చేస్తూ ఉభయ సభలను స్థంభింపజేస్తున్నారంటూ మండిపడ్డారు.

ప్రతిపక్షాలు పెట్టుకున్న కూటమి పేరులో ‘ఇండియా’ (I.N.D.I.A)టే సరిపోదు అంటూ విపక్షాలపై మోదీ సంచలన విమర్శలు చేశారు. ఉభయ సభల్లోను చర్చలు జరకుండా విపక్షాలు వ్యవహరిస్తున్న తీరు తనను తీవ్రంగా కలచివేస్తోంది అంటూ మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. I.N.D.I.A కూటమిని ప్రధాని మోది ఈస్ట్ ఇండియాతో పోల్చారు.

100 Rupees Note : కొత్త రూ.100 నోటు వెనుకున్న ఈ బొమ్మ గురించి తెలుసా..? ఈ అద్భుత నిర్మాణం వెనుక ఓ రాణి

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ( Modi) తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఎంతగా డిమాండ్ చేసినా ప్రధాని మణిపూర్ పరిస్థితిపై చర్చకు సిద్ధమని ప్రకటించటంలేదంటూ విమక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దీంతో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు I.N.D.I.Aలోని ప్రతిపక్ష పార్టీలు సిద్దమవుతున్నాయని తెలుస్తోంది.

ప్రతిపక్ష ఎంపీలు తమ నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని ఏ దిశాదశ లేకుండా వారు ముందుకు వెళ్తున్నారు అంటూ ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఒక లక్ష్యం అంటూ లేకుండా వ్యవహరిస్తు ముందుకెళ్లే విపక్షాలను నేను ఇంతవరకు చూడలేదన్నారు. ఇండియా అని పేరు పెట్టుకున్న విపక్ష పార్టీలు ఎప్పటికీ విపక్షంలోనే ఉండాలని అనుకుంటున్నట్లుగా ఉంది వారి తీరు.. అంటూ ఎద్దేవా చేశారు.పేరులో ఇండియా(I.N.D.I.A) ఉంటే సరిపోదు.. ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్.. వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.