TDP ధర్మపోరాటం : నల్లచొక్కాతో చంద్రబాబు దీక్ష

  • Publish Date - February 11, 2019 / 03:39 AM IST

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నల్లచొక్కా ధరించి దీక్ష ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ బాబు…దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ రాష్ట్రంలో చేపట్టిన ఈ దీక్షను హస్తినకు మార్చారు. ఏపీ భవన్‌ వద్ద ఉదయం 8గంటల నుండి రాత్రి 8గంటల వరకు బాబు ఈ దీక్ష కొనసాగించనున్నారు. ఏపీ మంత్రులు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు హాజరయ్యారు. దీక్షలో పాల్గొనేందుకు ఏపీలోని జిల్లాల నుండి టీడీపీ నేతలు ఢిల్లీకి వచ్చారు. దీక్ష స్టార్ట్ చేసేముందు బాబు…రాజ్ ఘాట్ వద్ద మహాత్మగాంధీకి నివాళులర్పించారు. ఏపీ భవన్‌లో అంబేద్కర్ విగ్రహానికి, దీక్ష వేదికపై గాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ చిత్రపటాలకు బాబు నివాళులర్పించారు.

తెలుగు, విద్యార్థి సంఘాలు దీక్షకు మద్దతిచ్చాయి. ఫిబ్రవరి 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై వినతపత్రం సమర్పిస్తారు. 

26 మంది టీడీపీ మంత్రులు
100 మంది ఎమ్మెల్యేలు
56 మంది ఎమ్మెల్సీలు 
300 మంది పార్టీ సీనియర్ నేతలు
3 వేల మంది దీక్షకు హాజరు
ఢిల్లీ నుంచి 2 వేల మంది తెలుగు ప్రజలు…మరో 2 వేల మంది స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల ప్రతినిధులు దీక్షకు హాజరు