Karnataka Elections 2023
Karnataka Elections 2023: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కుమారుడు, ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge)కు ఎన్నికల సంఘం ఇవాళ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రధాని మోదీ(PM Modi) పై ప్రియాంక్ ఖర్గే పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections 2023) వేళ తాజాగా కళబురిగి జిల్లాలో భాగంగా బంజారా ప్రజలను కలిసిన ప్రియాంక్ ఖర్గే ఈ సందర్భంగా మాట్లాడుతూ… మోదీని పనికిమాలిన కొడుకు(nalayak beta) అని అన్నారు. దీంతో సోమవారం బీజేపీ (BJP) కర్ణాటక నేతలు ఎన్నికల సంఘానికి (Election Commission) ఫిర్యాదు చేశారు.
చివరకు, ప్రియాంక్ ఖర్గేకు ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ నిన్న భారత ఎన్నికల సంఘం (ECI) స్టార్ క్యాంపెయినర్లకు పలు సూచనలు చేసింది. రాజకీయ ఉపన్యాసాలు చేసే సమయంలో హుందాగా వ్యవహరించాలని చెప్పింది. కొన్ని రోజుల క్రితం మోదీని మల్లికార్జున ఖర్గే విషసర్పం అని అన్నారు.
దీంతో ఆ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఆ ఘటన మరవక ముందే ఖర్గే కుమారుడు ప్రియాంక్ కూడా మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మోదీ కర్ణాటకలో దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ తనను తిట్టడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
Karnataka elections 2023: కాంగ్రెస్‌కు అదిరిపోయే కౌంటర్.. జై బజరంగ్ బలీ నినాదాలు చేసిన మోదీ.. వీడియో